మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.  అయితే చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి..అలాంటి సినిమాల్లో ఒకటి ‘పున్నమినాగు’.  యం.రాజశేఖర్ దర్శకత్వంలో నరసింహరాజు, రతీ అగ్నిహోత్రి,చిరంజీవి నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.  ఈ సినిమాలో చిరంజీవి చిన్ననాటి నుంచి విషయం తాగుతూ..విషపురుషుడు అవుతాడు..పున్నిమిరాత్రిలో ఎవరైనా స్త్రీని కలిస్తే ఆమె చనిపోతుంది.
Punnaminagu.jpg
ఇలాంటి స్టోరీలు సినిమాలో అయితే ఒకే..కానీ నిజజీవితంలో ఉంటే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, కల్లుకుంట గ్రామానికి చెందిన తలారి చిరంజీవి గత మూడు దశాబ్దాలుగా పాముల విషాన్ని తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.  మరి అతనికి ఏమీ కాలేదా? అనేగా మీ డౌటు..! అవును. అతనికి ఏం కావడం లేదు. అతని వయసు ఇప్పుడు 42 ఏళ్లు.  చిరంజీవి తాత ముత్తాతలు అందరూ పాములు పట్టి బతికేవారు. చిన్న నాటి నుంచి పాములతో ఆడుకోవడం..బాగా అలవాటు కావడంతో ఆడుకోవడం అలవాటు అయ్యింది.
Image result for SNAKE POISON
వేడి వేడి టీలో పాము విషాన్ని కలుపుకుని తాగే అలవాటు అతనికి ఉంది. ఎలాంటి విష సర్పాన్నైనా సరే అతను సులభంగా పట్టేస్తాడు. పాములతో కాలక్షేపం చేయడమంటే అతనికి ఎంతో సరదా.  అయితే నోటి ద్వారా విషం తీసుకుంటే  ప్రమాదం లేదని వారు చెబుతున్నారు. మరోవైపు జనవిజ్ఞాన వేదిక సభ్యులు మాత్రం ఇలాంటి అలవాటును మానుకోవాలని చిరంజీవికి సూచిస్తున్నారు. 

పాముల నుంచి విషం పిండుకున్నాక వాటి కోరలను పీకేసి దగ్గర్లో ఉన్న అడవుల్లో వాటిని విడిచిపెడతానని చిరంజీవి చెబుతున్నాడు. ఏడాదిలో కనీసం 30-40 సార్లయినా విషం తాగాల్సిందేనని అతను చెబుతున్నాడు.  తన యుక్త వయసు నుంచి పాములు పడుతున్నానని..తాను ఎన్నోసార్లు కాట్లకు గురయ్యానని, అయితే తనకేమీ కాలేదని అతను చెబుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: