ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీలో కీలక భూమిక పోషించారు నాగం జనార్థన్.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు.    అయితే ఆయన రాకను కొందరు జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. నాగం పార్టీలో చేరితే... పార్టీకి నష్టమని... ఆయన కేడర్ లేని లీడరని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిబెడితే... ఓడిపోవడం ఖాయమన్నారు. ఒకవేళ పార్టీలోకి తీసుకుంటే... తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని దామోదర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.
Image result for t congress
ఇకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ పై కొంత కాలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాగం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో టీడీపీలో ఆయనతో పాటు చేసిన రేవంత్ రెడ్డి ఈ మద్యే కాంగ్రెస్ లోకి జంప్ అయిన విషయం తెలిసిందే.  బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Image result for bjp
మెయిల్‌ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం గురువారం రాజీనామా లేఖను పంపారు.  తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందని..కుటుంబ పాలనతో తెలంగాణ ను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు నాగం జనార్థన్. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలపై తాను పోరాడుతున్నానని, అయినా తనకు బీజేపీ ఏమాత్రం సహకరించడం లేదని నాగం ఈ సందర్భంగా మండిపడ్డారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నాగం జనార్దన్‌రెడ్డి భావిస్తున్నట్టు గత కొన్నిరోజులుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: