ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే రాజకీయం రసకందాయంలో పడంది. ఎన్నికల మూడ్ వచ్చేసింది.. ఎత్తులు పై ఎత్తులు.. మొదలయ్యాయి.. అయితే ఈ రాజకీయాలు ఇంకా చాలా మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల బట్టి.. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టే అవకాశం ఎవరికి ఉందన్న విశ్లేషణలు మొదలైపోయాయి కూడా. 

Image result for JAGAN CHANDRABABU

కొందరు వచ్చే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు.. కేంద్రం చేసిన మోసాన్ని హైలెట్ చేసి.. జనంలో సెంటిమెంట్ రగిలించి.. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మరికొందరేమో.. వచ్చే ఎన్నికల్లో జగన్ దే చాన్స్ అంటున్నారు. గత ఎన్నికల్లోనే జగన్ కు విజయం కొద్దిలో తప్పిపోయిన సంగతి గుర్తు చేస్తున్నారు.


అయితే.. అనూహ్యంగా వీరిద్దరూ కాకుండా మరో తెలుగు వ్యక్తి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా.. ఉంటే గింటే.. అటు లోకేశ్ కానీ.. ఇటు వైసీపీ నుంచి ఇంకెవరైనా కానీ సీఎం అవ్వొచ్చు.. కానీ అటు టీడీపీ కాకుండా.. ఇటు వైసీపీ కాకుండా మూడో పార్టీ వ్యక్తి సీఎం అయ్యే అవకాశాలున్నాయని నటుడు శివాజీ చెబుతున్నారు. ఓ జాతీయ పార్టీ ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోందని సంచలనం బయటపెట్టారు.

Image result for RAM MADHAV AMIT SHAH

వచ్చే ఎన్నికల్లోపు అవినీతి ఆరోపణలపై చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరినీ జైలుకు పంపుతారని.. జగన్ అండతో ఎన్నికల్లో గెలిచిన సదరు జాతీయ పార్టీ అధికారం చేపట్టబోతోందని ఇందుకు దారుణమైన కుట్ర జరుగుతోందని శివాజీ వెల్లడించారు. ఆయన చెప్పిన గుర్తుల ప్రకారం... వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యే వ్యక్తి బీజేపీ నేత రామ్ మాధవ్ కానీ.. జీవీఎల్ నరసింహారావు కానీ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: