సినీ నటుడు శివాజీ బయటపెట్టిన "ఆపరేషన్ గరుడ" ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం గా మారింది. అది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ.. 
వినడానికి మాత్రం ఇలా జరిగే అవకాశం ఉంది అనిపించేలా వ్యూహాలు ఉన్నాయి. అంతే కాదు.. ఆ వ్యూహాలు చూస్తే రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపించక 
మానదు. అసలు ఆ ఆపరేషన్ గరుడ ఏంటో డిటైల్డ్ గా చూద్దాం.. 



రాష్ట్రంలో అధికార పార్టీ :- ఈ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలి అనే దానిలో భాగంగా (1). సీబీఐ కేసులు రీఓపెన్ చేయడం. కొత్త నాయకుడు లోని రెండో పార్ట్‌కు చెందినవారు.. ఢిల్లీలో కూర్చోని ఈ కేసులను ఓపెన్ చేసే పనిలో ఉన్నారు (వీళ్లకు రాజకీయాలతో అసలు సంబంధం లేదని ప్రస్తుతం చెబుతున్నారు). (2). ఆర్థికంగా దెబ్బతీయడం పార్టీకి చెందిన నేతల వ్యాపారాలను దెబ్బతీయడం, చక్రబంధం చేయడం తద్వారా ఆ మనిషిని ఒంటరిచేయడం ఆఖరికి ఈ అధికార పార్టీని నిర్వీర్యం చేయడం. ఇది కాస్త ఆశ్చర్యకరంగానే ఉండొచ్చు.



కొత్త నాయకుడు :- అన్నింటి కంటే ప్రమాదకరమైన విషయం తెలియదు. (1). స్థానికంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం. (2). ప్రజలకు సంకేతాలు ఇవ్వడం, రాష్ట్రం పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు.. ఆ బాధ్యతలో భాగంగా ఆయన కొన్ని పరిశోధనలు చేయడం.. ఆ పరిశోధనలకు సమాజం పట్ల ప్రేమ ఉండి ఒలకబోసి మేం రాజకీయాల నుంచి వెళ్లిపోయామని చెప్పుకునే వ్యక్తులను.. కొత్త నాయకుడు తీసుకుంటారు. ఇందులో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌‌లు.. ఒక సీనియర్ పాత్రికేయుడు ఉంటారు వీరంతా కలిసి కొత్త నాయకుడికి సహకరిస్తుంటారు.. ఎలా ఇబ్బంది పెట్టాలి.. ఏం చేయాలనే సలహాలు కూడా ఇస్తుంటారు. ఇందులో ఉండేవారంతా బలి పశువులే.



ఇంకో ముఖ్యమైన పార్టీ : ఈ పార్టీకి చెందిన నేతకు బలవంతంగా పెట్టిన కేసులు కావచ్చు. సంబంధంలేని కేసులు కావచ్చు. ప్రాంతీయ పార్టీల్లో సహజంగా ఉండే బంధుప్రీతి, అవకాశం అన్నీ కలుపుకుని ఏమైనా కొన్ని సంపాదనలు జరిపివుండొచ్చు.. జరపకపోయిండొచ్చు. కానీ నేరం నిరూపితం కానంత వరకు ఆయన నిర్దోషే. అయితే ఈ మొత్తం ఆపరేషన్‌‌కు అసలు బలిపశువులు వీళ్లే. చాలా ఈజీగా జాతీయపార్టీకి దగ్గరయ్యామని అనుకుంటున్నారు. ఈ ముఖ్య పార్టీ నాయకుడి మీద గుంటూరు, హైదరాబాద్‌‌లో ఇలా రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించడం జరిగింది. పకడ్బంధీగా ప్రాణహానీ లేకుండా దాడులు జరపడం. ఆ ప్రాణహానీ లేని దాడులతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడులు మొదలవుతాయి. అనంతరం ఈ అలజడులతో కొన్ని ఊరటలు లభిస్తాయి. అయితే ఈ ముఖ్యనేతకు పూర్తి ఊరట రాదు.. దీంతో చాలా వరకు పెండింగ్‌లోనే ఉంటాయి. 


ఆఖరి ఘట్టం:- ఈ ఆపరేషన్‌‌లో అతి ముఖ్యమైన రోజు సెప్టెంబర్ 01. అధికార పార్టీ అనగా ప్రభుత్వాన్ని డిస్వాల్వ్ చేయడం. రాజకీయాల్లో మొట్టమొదట ఏపీ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే అదే రోజన జాతీయ పార్టీ టార్గెట్‌గా ఎంచుకోవడం జరిగింది. అధికార పార్టీ డిసాల్వ్ అయిన తర్వాత ఇక తదుపరి పని కొత్తనాయకుడిదే. ఎన్నికలు జరుగుతాయ్. ఇందులో ముఖ్యనాయకుడి పార్టీ, కొత్తనాయకుడి పార్టీకి సీట్లు వస్తాయి.అయితే ఇందులో ముఖ్య పార్టీ నాయకుడిపై ఉన్న కేసుల్లో లోపలికి వెళ్లిపోతాడు. దీంతో ముఖ్య పార్టీ పని కూడా అయిపోతుంది. దీంతో అప్పటికే నిర్వీర్యమైన అధికార పార్టీలోని నేతలంతా 2, 3 పార్టీల్లో చేరతారు. తద్వారా ప్రభుత్వాన్ని ఈజీగా తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. అయితే కొన్ని ఒత్తిళ్ల ద్వారా కొత్త నాయకుడి పార్టీకి చెందిన కీలక వ్యక్తిని కేంద్ర మంత్రిగా పంపిచాలని చూపిస్తారు. అయితే ఆ పనికి ఒప్పుకోరు.. అంతకముందు ఏ పనైతే పాత రోజుల్లో చేసుకుంటున్నారో తిరిగి అదే పనికి వెళ్లిపోతారు.మొత్తం మీద ముఖ్యమంత్రి ఎవరంటే.. మన తెలుగు వ్యక్తే ఈ పేరు మనందరికీ తెలుసు. దీంతో ‘ఆపరేషన్ ఆపరేషన్ గరుడ’ పూర్తవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: