కేవలం రెండు పార్టీల ఎంపీలు.. మొత్తం ముప్పై మందికి మించరు.. సభలో రోజూ వీరే ఆందోళన చేస్తున్నారు.. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇలా రావడం.. సభను అలా వాయిదా వేయడం ఐదురోజులుగా సీన్ రిపీట్ అవుతోంది. వీళ్ల ను కట్టడి చేసి సభను సజావుగా నిర్వహించేలా మోడీ ఎందుకు ముందుకు రావడం లేదు..సభలో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే అధికంగానే మెజారిటీ ఉన్నా టీడీపీ, వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించి, ఓటింగ్ జరిగేలా మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. 

Image result for లోక్‌సభలో

ఈ మొండి వైఖరికి కారణం ఏమిటి.. కారకులు ఎవరు.. అసలు మోడీ- అమిత్షా ద్వయం వ్యూహం ఏమిటి..? అనేది అటు బీజేపీ నేతలను, ఇటు ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కనీసం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన చేసే పార్టీల సభ్యులనో..లేక విపక్షాల నాయకులను పిలిచి ఎందుకు సమావేశం ఏర్పాటు చేయటంలేదు?. స్పీకర్ కాకపోతే ప్రభుత్వమే ఆ పని చేసి ఉండొచ్చు కదా?. కానీ అవేమీ ఎందుకు  జరగటం లేదు?.. ఇలా ఎన్ని ప్రశ్నలు తలెత్తుతున్నా...తాను ఏం చేస్తున్నాడో .. ఏం చేయబోతున్నాడో అన్న విషయాల్లో మోడీ చాలా క్లారిటీ గా ఉన్నట్లు సమాచారం. 

Image result for లోక్‌సభలో

సమావేశాల అనంతరం మోడీ తన రాజకీయ చతురత చూపించబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ళ పాటు కలిసుండి…ప్రత్యేక ప్యాకేజీకి స్వాగతించి చివరి నిమిషంలో రాజకీయంగా బీజేపీని టార్గెట్ చేయటంతో మోడీ- అమిత్ షా ద్వయం విపరీతమైన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ఏపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిన అంశాలు అన్నీ మోడీ దగ్గర ఉన్నాయని..అందుకే సమావేశాల వరకు మౌనంగా ఉండి అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పుతారనీ.. ఇక చంద్రబాబుకు ముప్పు తిప్పలేనని పలువురు నేతలు అంటున్నారు. 

Image result for bjp tdp

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయనీ.. ఎవరూ ఊహించని రీతిలో ఏపీలో మోడీ ప్రభంజనం ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ఓటుకు నోటు కేసు వివరాలు ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి తెప్పించుకున్నారనీ.. ఇక సరైన సమయంలో ఏపీలో అవినీతి, ఓటుకు నోటు కేసును ముందుకు తెచ్చి చంద్రబాబును మోడీ ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: