భారత దేశంలో రోజు రోజుకీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి.  అత్యాచారాలు, హత్యలు , లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి.  ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కొందరు మానవ మృగాలు మారడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో  మానవత్వం మంటకలిసింది.. ఓ మహిళను తీవ్రంగా కొడుతుంటే..ఇదేంటీ అని ప్రశ్నించకుండా పైశాచిక ఆనందం పొందారు. కనీసం జాలిపడకపోగా కళ్లప్పగించి చూసి వీడియోలు తీసుకోవడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.
 Woman Tied To Tree, Beaten As People Watch - Sakshi
పైగా అదొక సినిమా చూసినట్లు చూశారు. వందమందిలో ఎక్కువశాతం పురుషులే ఉన్నారు. అయినప్పటికీ అలా చేయడం తప్పు అని ఏ ఒక్కరు చెప్పలేదు. ఇదంతా కూడా పంచాయతీ పెద్దలు నిర్వహించిన ఘనకార్యం. వివరాల్లోకి వెళితే..దేశ రాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో బులంద్ షహర్ జిల్లాకు చెందిన గ్రామంలోని మహిళ వివాహేతర సంబంధం కలిగి ఉందని ఆరోపిస్తూ, ఆమె భర్త పంచాయతీ పెట్టించాడు.

దీంతో పంచాయతీ ఆమెను కట్టేసి కొట్టాలని శిక్ష విధించింది. దీంతో ఆమె భర్త పంచాయతీకి వచ్చిన ఊరి ప్రజలందరి ముదు అక్కడే ఉన్న చెట్టుకు ఆమె చేతులు కట్టేసి, సైకిల్ ట్యూబు, టైరుతో కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆమె స్పృహ కోల్పోయింది. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా వేగంగా స్పందించిన పోలీసులు ఆమె భర్తను, పంచాయతీ ప్రధాన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరో 25మందిపై కూడా కేసులు పెట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: