ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా నినాదమే వినిపిస్తుంది.  చిన్నా పెద్ద..ముసలీ ముతక ఎవ్వరి నోట విన్నా కేంద్రం తమకు అన్యాయం చేసిందని..ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని..‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో రోడ్లపైకి వచ్చారు జనాలు.  ఇప్పటి వరకు బీజేపీతో స్నేహ సంబంధాలు నడిపించిన టీడీపీ సైతం ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమిస్తుంది.  ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కొన్ని రోజుల నుంచి ఎంపీలు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే.
Image result for ap special status
అంతే కాదు కేంద్రంపై అవిశ్వసా తీర్మాణాన్ని కూడా పెట్టారు టీడీపీ నేతలు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని బందులు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రత్యేక హోదా కోసం టీడీపీ నేత పీఆర్ మోహన్ గుంటూరులో వినూత్న నిరసన చేపట్టారు. లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా కూడలి వద్ద క్రేన్ నుంచి 20 అడుగుల ఎత్తున వేలాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు ఆయన తన నిరసన తెలిపారు. 
Image result for modi
అలాంటి సాహసం చేయడం వల్ల ప్రమాదానికి గురి కావొచ్చని మొదట పోలీసులు నిరాకరించారు..కానీ మోహన్ మాత్రం తాను నిరసన తెలిపే తీరుతానని పట్టుబట్టారు. దాంతో పోలీసులు...వైద్య సహాయం, అంబులెన్సుల ఏర్పాటు తర్వాత మెహన్ ఆందోళనకు అనుమతించారు. ఈ సందర్బంగా పీఆర్ మోహన్ మాట్లాడుతూ..అడ్డగోలు విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. 
Image result for chandrababu
రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతుంటే..ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఏపీ ప్రజలకు మొండిచేయి చూపిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజలకు ఇక ఊరుకునే పరిస్థితిలో లేరని..వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని..ఇప్పటికేనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ఇతర విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని మెహన్ డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: