గత కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.  స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ఓటును పరిగణలోకి తీసుకోవొద్దని సీఈసీ ఆదేశం. కాంగ్రెస్ ఏజెంట్‌కు చూపించి ఓటు వేశారని రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మాధవ రెడ్డి ఓటును పరిగణనలోకి తీసుకోకూడదని ఈసీ నిర్ణయించింది.
Image result for దొంతి మాధవ రెడ్డి
అంతే కాదు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరి ఓటు వేసిన ఏడుగురు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 58 రాజ్యసభ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 33 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తక్కిన 25 స్థానాలకు గాను ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది.
Image result for రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్
నామినేట్ సభ్యులైన రేఖ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సామాజిక కార్యకర్త అనూ ఆగా ఏప్రిల్‌లో రిటైరవుతున్నారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో 18 మంది అభ్యర్థులను బీజేపీ నిలిపింది. వీరిలో బీజేపీ జాతీయ మీడియా హెడ్ అనిల్ బలుని, బీజేపీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే కూడా ఉన్నారు. కేద్ర మంత్రి జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ యూపీ నుంచి, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీహార్ నుంచి పోటీ చేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, థావర్ చంద్ గెహ్లాట్, మరో మంత్రి మన్‌సుఖ్ ఎల్.మాండవీయ, పర్సోత్తమ్ రూపాల కూడా రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నారు.
Image result for రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్
యూపీలో 8 మందిని రాజ్యసభకు పంపేందుకు అవసరమైన బలం బీజేపీకి ఉండగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా తొమ్మిదో అభ్యర్థిని కూడా బరిలోకి దింపడంతో ఉత్కంఠ నెలకొంది. బీఎస్‌పీ అభ్యర్థిని అడ్డుకోవడమే బీజేపీ వ్యూహంగా చెబుతున్నా, అదే జరిగితే దళితులకు బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు దీన్ని ప్రచారాస్త్రంగా బీఎస్‌పీ అధినేత్ర మాయావతి వాడుకునే అవకాశం ఉందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: