అవును మీరు చదివినది నిజమే! ఆంధ్రరాష్ట్రంపై, ఆంధ్ర ప్రజలపై మోడీ సర్కార్ చూపిస్తున్న వివక్షను బట్టి చూస్తే ఇది నిజమేనని సందేహం రాక తప్పదు. ఆనాడు సమైక్య రాష్ట్రాన్ని యూపీఏ విభజిస్తున్నప్పుడు అప్పటి ప్రధాన ప్రతిపక్షం అయిన బీజేపీ సమక్షంలోనే విభజనపరంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పిస్తామని తేల్చిచెప్పింది. 


దీన్నే ఒక అస్త్రంగా భావించిన మోడీ తాము అధికారంలోకి రాగానే ఆంధ్రకు హోదా కల్పిస్తామని శపథం కూడా చేశారు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల అయింది. ప్రత్యేకహోదా కాదు గదా అసలు బడ్జెట్లో ఆంధ్రా అనే పేరును కూడా ప్రస్తావించలేదంటే ఆయనకు ఆంధ్రపై ఉన్న వివక్ష ఎలాంటిదో అర్థమవుతుంది. ఆయన హయాంలో ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టగా ఏ ఒక్కదానిలోనూ ఆంధ్ర పేరు రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. పోలవరం ప్రాజెక్టు అయినా మంజూరుచేసారులే అనుకుంటే నిధులు పూర్తిగా ఇవ్వకుండా ఆపేసి ప్రాజెక్టును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.


కనీసం అవిశ్వాసం పెడితే  అయినా మన గోడును వెళ్లబోసుకోవచ్చు అని అనుకున్న మన నాయకులను అసలు మోడీ సర్కారు పరిగణలోనికి తీసుకుంటున్నదా అన్న సందేహాలు తెలుగు ప్రజల మెదడులో మెదులుతున్నాయి. గత ఐదు రోజులనుండి మన నాయకులు అవిశ్వాస నోటీసులు ఇస్తున్నా సభ సజావుగా గడవడంలేదన్న కొంటె సాకుతో ప్రతిసారి వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా ఎగువ, దిగువ సభలను అదే సాకుతో సభలను సోమ, మంగళవారాలకు వాయిదా వేశారు. అసలు భారతదేశ మ్యాప్ లో ఆంధ్రా అనే రాష్ట్రం ఉందన్న సంగతిని మోడీ మరచిపోయాడా అని ఛలోక్తులు విసిరేవాళ్ళు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: