ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకెష్ శాసనసభ వరండాలో ప్రతిపక్షాలపై ధారుణంగా విరుచుకుపడ్డారు. తన సామర్ధ్యం కార్య నిర్వాహణ మీద అనుమానమే ఎవరికి తగదని అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రానికి తరలివచ్చే కంపెనీలకు 21రోజుల్లోగా భూములతో పాటు అన్ని ఇతర మౌలిక సదు పాయాలతో పాటు పరిశ్రమల స్థాపనకు చెందిన అన్నీ అనుమతులూ సింగిల్-విండో లాగా ఒకేచోట ఇస్తున్నామన్నారు మంత్రి లోకేష్.  తాను ఐటి శాఖా మంత్రి అయ్యాక, రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల స్థాపన ప్రగతి ఊహాతీతంగా పెరిగిందన్నారు.
Image result for lokesh in assembly lobby
తన "ప్రోగ్రెస్ రిపోర్ట్" మీద వ్యాఖయలు, విమర్శలు చేసిన, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు లోకేష్. ఐటీ పాలసీ నిబంధనల విషయంలో తర తమ బేధాలు లేకుండా అన్ని కంపెనీ లతో ఒకే రకమైన పోలసీ విధానం నిభంధనలు అవలంబిస్తున్నామన్నారు. "శాసనసభకు వచ్చినవారు, సభకు రాని వారూ అందరూ వినండి, ఇదీ నేను సాధించిన ఐటీ  ప్రగతి" అంటూ తన గురించి స్వోత్కర్షలు, పరులపై నిందలు విమర్శ స్పోరకంగా అలవిమాలిన ఆవేశంతో ప్రసంగించారు ఐటి శాఖా మంత్రి లోకేష్. 
Image result for lokesh in assembly at Hero Moto corp
తన మీద ఆరోపణలు చేస్తున్న వైసీపీ, బీజేపీ లకు దమ్ముంటే రాష్ట్రానికి ఒక్క ఐటీ కంపెనీ అయినా తీసుకురాగలరా?” అని సవాల్ విసిరారు. ”మీకు విమాన టిక్కెట్లు, నేను బుక్ చేస్తా, హోటల్ ఖర్చులు కూడా నేనే భరిస్తా, ప్రయత్నించండి. రాష్ట్రానికి రెండు ఐటీ కంపెనీలు తీసుకురండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసమయంలో శాసన సభ వరండాలో ప్రతిపక్షం ఉండి వుంటే లోకేష్ విశ్వరూపం చూసే అవకాశం కలిగి వుండేదటవారికి.  అయినా, అపోజిషన్ పార్టీలు ఐటీ కంపెనీలు తీసుకురావడం, ఏమిటి? అంటూ,  శాసనసభ లాబీల్లో సణుగుళ్లు వినపడ్డాయి.
Image result for lokesh in assembly at Hero Moto corp
ఏదేమైనా, ఏపీ అసెంబ్లీలో ఈసారి "ఫ్రైడే లోకేష్ డే పూర్తి ఫన్ డే" లాగా మారిందంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సెటైర్లు వేసుకొని చెప్పుకోని, నవ్వుకోవటం కనిపించింది. ఆ తరవాత ఇది విన్న విష్ణు కుమార్ రాజు లోకేష్ తెలివితేటలకు నవ్వాపుకోలేక పడీ పడీ నవ్వుకున్నారట. చిత్తూరు జిల్లాలో ₹1600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు  అయ్యే  "హీరో మోటోకార్ప్ సంస్థ" గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని మరో మారు ౠజువు చేసుకున్నారని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ని "ఆటోమొబైల్ హబ్‌" గా తీర్చిదిద్దడమే తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని అనారు మంత్రివర్యులు  లోకేష్.

Image result for lokesh in assembly at Hero Moto corp

మరింత సమాచారం తెలుసుకోండి: