అప్పట్లో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని కేవలం దిక్కులను బట్టి మాత్రమే విభజించడం జరిగింది. కానీ రాను రాను అది ఉత్తర భారతదేశ ప్రజల, దక్షిణ భారతదేశ ప్రజల మధ్య ఒక వైరంలా  తయారవుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం మన పాలకులే అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఉత్తరాది నాయకులే కీలక పదవుల్లో ఉండటం దక్షిణాది రాష్ట్రాలకు శాపంలా తయారవుతుంది.

కేవలం ఉత్తరాది మీదనే ప్రేమ ఉలకబోస్తూ దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తున్నారు. ఇదే విషయాన్ని దక్షిణాది నాయకులు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ వివక్షపైనే తిరుగుబాటు మొదలయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇందుకు మొదట ప్రధానిగా ఉన్న మోడీనే దక్షిణాది నాయకులకు మొదటి టార్గెట్ గా అవబోతున్నాడనేది స్పష్టంగా కనపడుతోంది.


ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ట్విట్టర్లో చేసిన ట్వీట్ అదే సంకేతాలను సూచిస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి ఇప్పటివరకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకునే వారు కానీ ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకునేందుకు కేంద్రం సిద్ధమయింది. ఇలా చేస్తే 2011 లెక్కలప్రకారం ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ఎక్కువ నిధులు వాళ్లకు చేకూరుతాయి. దీనిని ఆయన వ్యతిరేఖిస్తూ దక్షిణాది రాష్ట్రాలు ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆయన ట్వీటు చేసాడు. అంతేగాక అన్ని దక్షిణాది రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేశాడు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు బీజేపీయేతర వాళ్ళు అవడం కేంద్రంపై ఖచ్చితంగా పోరాటం చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: