తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో సుమన్.  కెరీర్ బిగినింగ్ లో హిట్ సినిమాల్లో నటించి మంచి ఫామ్ లోకి వచ్చిన సుమన్ కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి మరికొన్ని హిట్ సినిమాల్లో నటించాడు.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సుమన్ తండ్రి, మామ, విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు.  ఈ మద్య సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది నటులు రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. 
Related image
ఈ నేపథ్యంలో తమిళనాడులో రజినీకాంత్, కమల్ హాసన్ కొత్త పార్టీలు పెట్టి మరీ రాజకీయాల్లోకి వస్తున్నారు.  ఇక తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాన్ జనసేన పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక్షంగా పాల్గొనబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ మొగ్గు చూపుతున్నారు. భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరుతానని చెప్పారు. 
Image result for trs
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ది పనులు చేపట్టారని అన్నారు. పేద ప్రజల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని అన్నారు. గౌడ కులానికి కేసీఆర్ చేసిన మేలు చాలా గొప్పదని అన్నారు. తమ జాతికి ఆయన చేసిన మేలుకు... ఆయనకు పాదాభివందనం చేస్తున్నామని చెప్పారు.
Image result for trs
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. అంతే కాదు  తన నుంచి కేసీఆర్ ఎలాంటి సహాయం పొందాలనుకున్నా... దానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, ఒరియా సినిమాలు చేస్తున్నానని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: