జండా పీకేద్దాం అనే ఉద్దేశ్యం లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో అనేక రకాల చర్చలు మొదలు అయ్యాయి .. గత ఎన్నికల్లో టీడీపీ  - బీజేపీ ల మైత్రి కి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరవాత కాలం లో వారిని ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటూ ప్రశ్నించాడు కానీ పెద్దగా ఆన్సర్ లు రాబట్టినట్టు ఎక్కడా కనపడలేదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ విషయం లో అందరూ చిర్రెత్తుకుని ఉన్న తరుణం లో అందరినీ కూల్ చెయ్యాలి అన్నట్టుగా టీడీపీ కి సపోర్ట్ ని ఉపసంహరణ చేసుకుంటున్నా అని ప్రకటించి .. పవన్ కళ్యాణ్ గా జనసేన అధినేత గానే మిగిలిపోయాడు.
Image result for pawan kalyan political

వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఏం చేస్తాడు అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్న మాట .. పవన్ కల్యాణ్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎక్కడికైనా వెళ్తే చూడటానికి వేల మంది ఎగబడతారు. అంతమాత్రానా దాన్నే పొలిటికల్ ఫాలోయింగ్ అనుకోలేం. కానీ పవన్ కల్యాణ్ కు ఓ సామాజికవర్గం అండ ఉందన్న అభిప్రాయం ఉంది.
Image result for pawan kalyan political
అందుకే ఆయన కూడా ధైర్యం చేసి పార్టీ ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ పెట్టిన తర్వాత రెండోసారి మళ్లీ ఎన్నికల మూడ్ వచ్చింది. తనకు హడావుడి ఏమీ లేదని.. పాతికేళ్ల రాజకీయం కోసం వచ్చానని చెప్పుకుంటాడు.
Related image
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత …. అలా చెప్పుకునే మొదటి వ్యక్తి పవన్ కల్యాణే అయి ఉంటాడు. ఆపరేషన్ గరుడ దగ్గర నుంచీ అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ ని జనం నమ్మడం మానేశారు అని గట్టిగా మాటలు వినపడుతూ ఉన్నాయి .. దీంతో పవన్ పార్టీ ఎత్తేస్తాడు జండా పీకేస్తాడు అంటూ ట్విట్టర్ లో చాలామంది హల్చల్ చేస్తూ చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: