ఇదో విచిత్రమైన కథ.. సమాజాన్ని ఎదిరించిన ఓ జంట కథ. ప్రపంచంలోనే అరుదైన ఓ వింత కథ. సెక్స్ మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి గురించి గతంలో ఎన్నో కథలు చదివాం. కానీ.. ఇక్కడ మాత్రం.. ఆమె, అతడూ ఇద్దరూ సెక్స్ మార్పిడి చేయించుకున్నవారే.. ఆ తరవాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులో జరిగిన వింత కథ ఇది. 

ప్రితీష

ప్రితీషా అనే అబ్బాయి 1988లో తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కల్యాణిపురంలో జన్మించాడు. కానీ పుట్టుకతో అబ్బాయి అయినా అతడికి తాను అమ్మాయిననే అనిపించేది. అమ్మాయిగా జీవించాలనుకున్నాడు ప్రితీష్.. చివరకు 17 ఏళ్ల వయస్సులో లింగ మార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారి ప్రితిషా అని పేరు మార్చుకున్నారు. 

పెళ్లి జంట
ఇక 1991లో ఈరోడ్ లో జన్మించిన ప్రేమ్ కుమార్ పుట్టుకతో అమ్మాయి.. కానీ తాను మగవాడిననే ఆమె అనుకునేది. అమ్మాయిలా జీవించలేకపోయింది. ఆ తర్వాత ఆమె సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ప్రేమ్ కుమార్ గా మారిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. తామిద్దరూ సమాజంలో నుంచి వివక్ష ఎదుర్కొంటున్న విషయం గ్రహించారు.

పెళ్లి జంట

తామిద్దరే ఎందుకు వివాహం చేసుకోకూడదనుకున్నారు. అంతే.. 2018 మార్చి 8న మహిళా దినోత్సవం రోజు వీరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అదీ ప్రేమ్ కుమార్-ప్రితిషాల వింత ప్రేమ కథ.



మరింత సమాచారం తెలుసుకోండి: