ఈ మద్య మీడియాలో ఇదిగో పులి అంటే అదిగో తోక అనే చందంగా వార్తలు క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికి జరిగేది కొంత అయితే..ఎవరి రేటింగ్ కోసం వారు ఆ న్యూస్ ని రక రకాలుగా సృష్టిస్తున్నారు.  కొన్ని సార్లు అయితే సెలబ్రెటీలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే..వారు చనిపోయారని వార్తలు కవర్ చేయడంతో ఆ సెలబ్రెటీలు మేం బతికే ఉన్నాం మోర్రో అని మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
breaking news
ఇలాంటి న్యూస్ ల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా తప్పు‍డు వార్తలపై చర్యలకు మలేషియా ప్రభుత్వం ఉపక్రమించింది. నకిలీ వార్తలు రాసేవారికి, ప్రచారం చేసేవారికి 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా విధించే దిశగా చట్టాన్ని తేనున్నట్లు మలేషియా సర్కారు భావిస్తోంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతో పాటు, జరిమానాను కూడా విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
Image result for fake news
ఈ చట్టంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా.. మలేషియా సర్కారు మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ప్రజా భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని.. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలిగించదని భరోసా కల్పించడం కోసమేనని వివరణ ఇచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్లు జైలు శిక్ష లేదా 5,00,000 రింగిట్‌లు(దాదాపు 84 లక్షల రూపాయలు) జరిమానా విధించనున్నారు.
Image result for fake news
ఈ చట్టాన్ని బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఉల్లఘించినా, వారు మలేషియాలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ నివేదిక ప్రకారం ‘రిపోర్టర్స్‌ విత్‌ అవుట్‌ బార్డర్స్‌’ జాబితాలో మలేషియా 144వ స్థానంలో ఉంది. మలేషియా ప్రధాన మంత్రి నజీబ్‌ రజాక్‌ ఇప్పటికే తనపై అవినీతి ఆరోపణలు చేస్తోన్నవారిని టార్గెట్‌ చేశారు. ఆగస్టులో జరిగే ఎన్నికల్లో గెలుపోందడానికే రజాక్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: