తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటారని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మాట తప్పారని, దాన్నే గుర్తు చేసి విమర్శించినందుకు తనపై కక్షకట్టారని ఆరోపించారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాడుతున్నానని..తెలంగాణ పోరాట సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాటలు ఏవీ నిలబెట్టుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దొరలకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయమా? అని ఎమ్మార్పీయెస్ వ్యవస్థాపక నేత మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.
Image result for kcr
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే 20 కేసులు నమోదు చేసి తనను జైలుకు పంపించారని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలు ధ్వంసం చేయలేదా? ఆందోళనలు చేపట్టలేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నారని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి స్వయంగా వెళ్లిన మంద కృష్ణ తన లేఖను కార్యాలయంలో అందించారు. గత సంవత్సరం జూలై 8వ తేదీన తాను సూర్యాపేట నుంచి వరంగల్ కు వెళుతుండగా దాడి జరిగిందని గుర్తు చేశారు. తాను మరణించే వరకు ఎస్సీల వర్గీకరణపై తమ పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. 

అంతే కాదు ఎస్సీల వర్గీకరణపై తమ పోరాటానికి స్పందిస్తూ, ఈ డిమాండ్ సాధనకు అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకు వెళతానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, ప్రశ్నించిన తనను రెండు సార్లు అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈనెల 14న అసెంబ్లీలో మాట్లాడుతూ, తనను అణచివేస్తానని కేసీఆర్ ప్రకటించడం ఆయన ఆంతర్యం అర్థమవుతుందని అన్నారు. తన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించి నిజాన్ని తేల్చాలని మంద కృష్ణ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: