తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఓ వీడియో ఇబ్బందిపెడుతోంది. ఆ వీడియోను బయటకు రప్పించాల్సిందే అని ప్రతిపక్షం పట్టుబడుతోంది. చివరకు కోర్టు కూడా ఆ వీడియో బయటపెట్టాల్సిందే అని తీర్పు చెప్పేసింది. దీంతో ఇప్పుడు కేసీఆర్ ఇరుకునపడాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది. ఇంతకూ ఆ వీడియో ఏంటా అనుకుంటున్నారా.. అదేనండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండలి ఛైర్మన్ స్వామి గౌడ్  కంటిని గాయపర్చిన వీడియో.

Related image

కొన్ని రోజుల క్రితం శాసనసభ ప్రారంభం తొలిరోజు.. గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు నిరసన చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన హెడ్ ఫోన్స్ ను గవర్నర్ కేసి విసరగా అది స్వామి గౌడ్ కు తగిలిందని ప్రభుత్వం చెబుతోంది. ఐతే.. ప్రసంగం తర్వాత మండలి ఛైర్మన్ మామూలుగానే గవర్నర్ ను సాగనంపేందుకు వచ్చారు. ఆ తర్వాత ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 

Image result for KOMATI REDDY SWAMIGOUD

క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏకంగా స్పీకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యత్వాన్నే రద్దు చేసేశారు. అయితే ఎక్కడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ స్వామిగౌడ్ కు తగిలినట్టు వీడియో మాత్రం లేదు. ఆ వీడియో చూపించాల్సిందేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబడుతున్నారు. ఇదే విషయంపై కోర్టుకు వెళ్లారు. చివరకు ఉమ్మడి హైకోర్టు కూడా వారికి అనుకూలంగానే స్పందించింది.



అందుబాటులో ఉన్న వీడియో ఫుటేజీని సమర్పించని పక్షంలో అందులోని అంశాలు వ్యతిరేకంగానే ఉన్నట్లు పరిగణిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఉమ్మడి హైకోర్టు మంగళవారం అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంచేసింది. గోపాల్‌, కష్ణాజీ కేడ్కర్‌ వర్సెస్‌ మహమ్మద్‌ హాజీ లతీఫ్‌ తదితరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏప్రిల్‌ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: