మహా భారతంలో ఉన్నదే ఈ భూమిపై జరుగుతుంది. ఈ భూమిపై జరిగేదేదీ మహాభారతంలో లేకుండా పోలేదు. అందుకే మహాభారతానికి ప్రతిబింబమే ఈకలికాలం.
Image result for draupadi bet in mahabharata
అసలు కథ చూద్ధాం:   

ధర్మరాజు ధర్మ పత్ని ద్రౌపదిని తనతోకలిపి ఐదుగురు సోదరులను జూదములో పందెంగా పెట్టి జూదమాడాడని మహాభారతంలో చదువుకున్నాం. ఉత్తర ప్రదేశ్ కి చెందిన ముస్లిం మహాభారతం చదివాడో? ఆ కథ గురించి విన్నాడో? లేదో? కానీ, జూదమాడి మాత్రం తన భార్య ఇద్దరు పిల్లలను పదెంగా జూదమాడి ఓడిపోయి కలకలం అల్లకల్లోలం చేశాడు. 
Image result for draupadi bet in mahabharata
బులంద్ షహర్‌ లో జూదం తదితరాలకు బానిసైన వ్యసనపరుడు మోహిసీన్ అనే వ్యక్తి, మరో జూదగాడైన ఇమ్రాన్ తో జూదమాడి, అందులో ఫణంగా పెట్టి తన భార్య, ఇద్దరు పిల్లల్ని ఓడిపోయాడు. దీంతో జూదంలో గెలిచిన ఇమ్రాన్‌, నేరుగా మోహిసిన్‌ ఇంటికి వెళ్ళి అతని భార్యను తనతో రమ్మని బలవంతం చేశాడు. అతనికి స్థానికులు అడ్డుతగలగా, బాధితురాలు ఆందోళనకు దిగింది. దీంతో ఇమ్రాన్ పెద్దలతో పంచాయతీ పెట్టించాడు.  
Related image
పంచాయతీ పెద్దలు జూదంలో మోహిసీన్ ఓటమి పాలయ్యాడు కనుక, అతని భార్య ఇమ్రాన్ తో వెళ్లేందుకు నిరాకరించడంతో అతని పిల్లల్లో ఒకరిని అతని వెంట పంపాలని తీర్పునిచ్చింది. దీంతో బలవంతంగా ఆమె పిల్లల్లో ఒకరిని ఇమ్రాన్ తన వెంట తీసుకెళ్లిపోయాడు. 
Image result for atrocities against women
ఇది సహించని భార్య మోహిసీన్ కు విడాకులిచ్చేసింది. అతనంతరం తన భర్త, తనను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఇమ్రాన్ పంచాయతీ పెద్దలు కావచ్చు మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోక పోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించి, తన కుమారుడ్ని ఇమ్రాన్ చెర నుంచి విడిపించాలని కోరింది. పిటిషన్ చూసిన చీఫ్‌ జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇదీ ఆధునిక మహాభారతంలో ద్రౌపదీ మానసంరక్షణ ఘట్టం. ఇక్క్డ కృష్ణ పాత్ర న్యాయస్థానానిది కావటం ఒక అద్భుతం. 

Image result for women problems in this society

మరింత సమాచారం తెలుసుకోండి: