ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఫీవర్ నడుస్తోంది. ప్రభుత్వం నుండి వామపక్షాల వరకు ప్రతి ఒక్క పార్టీ ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం చూపిస్తున్న వివక్షను, తీరును ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. ఈ నిరసనల తెగ దేశ రాజధాని ఢిల్లీ కి కూడా చేరుకుంది. పార్లమెంటు  సమావేశాలలో తెలుగు ఎంపీలు హోదా కోసం తమదైన శైలిలో గళాన్ని వినిపిస్తున్నారు.


హోదా సంగతి దేవుడెరుగునేమోకాని మన నాయకులు మాత్రం పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. విజయ సాయిరెడ్డిని సీఎం చంద్రబాబు ఒక నేరగాడు అంటూ పేర్కొంటూ విజయమాల్యాతో పోల్చాడు. తానేమి తక్కువ తినలేదన్నట్లుగా విజయసాయిరెడ్డి బాబుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు.బాబు ఒక గజదొంగ అని పేర్కొన్న ఆయన, నిజంగా ఒక తల్లికి, తండ్రికి పుట్టినవాళ్ళు అలాంటి వాఖ్యలు చేయరని చెప్పి పెద్ద దుమారాన్నే లేపాడు.


విజయసాయి రెడ్డి వాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అసలు ఒక ప్రజాప్రతినిధి నుండి అలాంటి వాఖ్యలు రావడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎట్టకేలకు బాబు కూడా ఆయన వాఖ్యలపై స్పందించారు. తల్లిదండ్రులు ఎవరికైనా దైవంతో సమానం. అలాంటిది నా తల్లిదండ్రులను నిందించడం దారుణం అని అన్నారు. తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయమా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం  కోసం ఎన్ని అవమానాలైనా భరించడానికి తాను సిద్ధం అని పేర్కొన్నారు. ఎంపీలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించిన అనంతరం ఆయన ఈ వాఖ్యలు చేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: