నాణ్యత, రక్షణ, సాంకేతికతో కూడిన వైద్యం కోసం స్విమ్స్ రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పంద కుదురుర్చుకుంది.  శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్, కోటి గ్రూప్ వెంచర్స్ తో మంగళవారం స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ లో పరస్సర అంగీకార పత్రాలపు మార్చుకున్నారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. స్విమ్స్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ నెల 26న ప్రకించిన విధంగా హెల్త్ కేర్ క్వాలిటీ మరియు పేషంట్ సేఫ్టీని అనుసందానిస్తూ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ’ ను హెచ్.జి.హె.ఐ మరియు కోటి గ్రూప్ వారి నేతృత్వంలో ఏర్పాటు చే సినట్లు తెలిపారు. 

ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా  డా.సార్థక్ దాస్ మాట్లాడుతూ.. స్విమ్స్ నందు 27, 28 తేదిలో విజిటింగ్ ప్రొఫెసర్ గా యుద్ద ప్రాతిపతికన, మద్యస్థంగా మరియు దీర్థకాలిక లక్ష్యాలతో ఈ బృహత్తర ప్రణాళికను అమలు పరుస్తున్నామన్నారు. డాక్టర్ సార్థక్ దాస, సీనియర్ అడ్వైజర్ , రీసెర్చ్ ట్రాన్స్ లేషన్ & గ్లోబల్ హెల్త్ పాలసీ, హెచ్.జి.హెచ్.ఐ., యు.ఎస్.ఏ చురుకైన పాత్ర పోషించారని అన్నారు. 


ఈ సందర్భంగా డా.సార్థక్ దాస్ స్విమ్స్ వైద్యులతో వివిధ పరిశోదనా అంశాలపై గల అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ పై ఒక ప్రత్యేక ఇన్ పేషంట్ కేర్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు.   స్విమ్స్ డైరెక్టర్ డా.సార్థక్ దాస్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు.  అంతే కాక కోటి గ్రూప్ చైర్మన్ సరిపల్లి కోటిరెడ్డి స్విమ్స్ కు విచ్చేసి పబ్లిక్ హెల్త్ మరియు పెషంట్ ఎక్స్ పీరియన్స్ పై స్విమ్స్ డైరెక్టర్ & డా.సార్థక్ దాస్ తో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిపారు. 


కోటి గ్రూప్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రపంచ ప్రసిద్ది చెందిన సంస్థ అని ఇది 14 సంయుక్త సంస్థల సమ్మిళతమని దీని ద్వారా 238 దేశఆలకు చెందిన 784 కోట్ల మంది ప్రజలు నివశిస్తున్నారని తెలిపారు.  అంతే కాకుండా ఈ ప్రపంచాన్ని ఇన్నోవేటివ్ గా టెక్నాలజి పద్దతుల ద్వారా ఎడ్యూకేషన్ టెక్నాలజి, ఫైనాన్స్ టేక్నాలజి, కన్ స్ట్రక్షన్ టెక్నాలజి, అగ్రికల్చర్ టెక్నాలజి & మీడియా టెక్నాలజి రంగాల్లో ఉత్తమంగా మార్చాలని చూస్తున్నారని తెలిపారు. కోటి సంస్థల అధినేతి స్విమ్స్ కోసం రూపొందించిన రోగులకు అభిప్రాయాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంట్ ద్వారా వివరించారు. 


స్విమ్స్ డైరెక్టర్ టి.ఎస్.రవికుమార్ క్వాలిటీ మిరయు పెషంట్ల భద్రతపై సారించి అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆచరిస్తున్నారు.  భారత దేశంలోనే స్వమ్స్ ఒక్కటి అనేక విధములైన క్వాలిటీ ప్రమాణాల ద్వారా ఆరోగ్యాన్ని మదింపు చేసే విధానాన్ని రూపొందించి అమలు పరుస్తున్నది. ప్రజల కోసం హెచ్.జి.హెచ్.ఐ., కోటి గ్రూప్ మరియు స్విమ్స్ ల ఆధ్వర్యంలో ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించి అందుబాటులోకి తెచ్చింది.

అంతే కాకఇందుకు దోహదపడే  మానవ సంబంధమైన కారకాలను గుర్తించడం ద్వారా పేషంట్ల యొక్కభద్రతను పెంపొందించడం ద్వారా ఆసుపత్రులలో మరణ శాతాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమర్థవంతమైన, చురుకైన ఆరోగ్య భద్రతా ప్రమాణాలను, హెల్త్ కేర్ ను పెంపొందించవచ్చునని స్వమ్స్ డైరెక్టర్ తెలపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: