భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది.  జీశాట్‌-6ఏ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ప్రయోగం విజయవంతమైంది. సతీశ్‌ ధావన్‌ రోదసీ కేంద్రం నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్తున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌08 బయల్దేరింది. 35,900 కి.మీ. దూరంలోని కక్ష్యలోకి ఈ ఉపగ్రహం విజయవంతంగా ప్రవేశించింది. దూరంలోని కక్ష్యలోకి ఈ ఉపగ్రహం విజయవంతంగా ప్రవేశించింది.దీని బరువు 2,140 కేజీలు.
Image result for gslv-f08
మల్టీ బీమ్ కవరేజ్ ఫెసిలిటీ ద్వారా మన దేశానికి మొబైల్ కమ్యూనికేషన్ సేవలు అందుతాయి.దీంతో భారత సైన్యానికి కమ్యూనికేషన్ సర్వీసులు మరింత విస్తృతమవుతాయి. మల్టీ బీమ్ కవరేజ్ ఫెసిలిటీ ద్వారా మన దేశానికి మొబైల్ కమ్యూనికేషన్ సేవలు అందుతాయి.ఈ రాకెట్ రెండో దశలో రెండు కీలకాంశాలను మెరుగుపరచినట్లు ఇస్రో ప్రకటించింది.
Image result for gslv-f08
అత్యధిక సామర్థ్యంగల వికాస్ ఇంజిన్, ఎలక్ట్రో మెకానికల్ యాక్చువేషన్ సిస్టమ్‌లను చేర్చినట్లు తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ తోటి శాస్త్రవేత్తలను అభినందించారు. జీ ఉపగ్రహాల్ని జీఎస్‌ఎల్వీ వాహకనౌకల ద్వారా ప్రయోగించడం ఇది 12వ సారి కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ అమర్చిన జీఎస్‌ఎల్వీని వినియోగించడం ఇది ఆరోసారి.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు.  ఉపగ్రహ ఆధారిత మొబైల్‌ కమ్యూనికేషన్‌ అప్లికేషన్లకు ఉపయోగపడే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివఅద్ధి చేయడానికి చక్కని వేదికను ఈ ఉపగ్రహం అందిస్తుందని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: