కారో.. బైకో వేసుకుని ఏ షాపింగ్ కాంప్లెక్స్‌కో.. బడా షాపింగ్ మాల్స్‌కో వెళ్తే వాహనం ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. ఒకవేళ బడా వ్యాపార సంస్థలో పార్కింగ్ చేస్తే నిమిషాలు గడిచినా కొద్దీ జేబులు ఖాళీ కావటం ఖాయం. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో పార్కింగ్ దోపిడీకి బ్రేక్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పార్కింగ్ పాలసీని రూపొందించింది.
Image result for కొత్త పార్కింగ్ పాలసీ
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన పార్కింగ్ విధానాన్ని తప్పనిసరిగా అన్ని మాల్స్, మల్టీప్లెక్సులు అమలు చేయాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ కమిషర్ ఆదేశించారు. కొత్త నిబంధనల ప్రకారం, తొలి 30 నిమిషాల వ్యవధి పాటు ఎటువంటి పార్కింగ్ ఫీజునూ వసూలు చేసేందుకు వీలు లేదు.ప్రతి ఒక్కరికీ బేషరతుగా ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాల్సిందే. ఆపై 31 నుంచి 60 నిమిషాల వరకూ షాపింగ్ సెంటర్ లో షాపింగ్ చేసినట్టు బిల్లు చూపితే పార్కింగ్ ఫీజును వసూలు చేయకూడదు.
Image result for కొత్త పార్కింగ్ పాలసీ
ఒకవేళ బిల్లును చూపించకుంటే నిర్ణీత మొత్తాన్ని వాహనదారుడి నుంచి తీసుకోవచ్చు.  ఆపై గంట దాటితే, పార్కింగ్ మొత్తానికన్నా అధికంగా డబ్బుతో కొనుగోలు చేసినట్టు బిల్లు చూపించాల్సి వుంటుంది. ఒకవేళ, మాల్ లో సినిమాహాల్ ఉండి, దానిలో సినిమాను చూసినట్లయితే, మూడు గంటల సమయం దాటినా పార్కింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు.  నగరంలో 9100 కిలోమీటర్ల రహదార్లు ఉండగా, వీటిపై ప్రతిరోజు 54 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
Image result for కొత్త పార్కింగ్ పాలసీ
పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటిలో తాత్కాలికంగా పార్కింగ్‌ను కల్పించే విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు కూడా కమిషనర్ సూచించారు. ఇక వాహనాల పార్కింగ్ సమయాన్ని తెలిపేలా సరైన ఉపకరణాలను వాడాలని, ఫీజుల వివరాలు అందరికీ కనిపించేలా డిస్ ప్లే చేయాలని అధికారులు ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: