శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం. త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో స్వామివారు శ్రీకోదండరామస్వామిగా తన భక్తులకు అభయమిస్తున్నారు. శ్రీరామునికి అనుంగు భక్తుడైన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో భాగం పంచుకోవాలని వచ్చిన భక్తలపై ప్రకృతి కన్నెర్రజేసింది. 
Heavy Rain At Vontimitta Temple - Sakshi
అకాల వర్షం, పెను గాలుల బీభత్సానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికిపైగా గాయపడ్డారు. అన్ని దేవాలయాల్లా కాకుండా ఈ ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీరామ నవమి తర్వాత పున్నమి రాత్రి వేళ ఇక్కడ కల్యాణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం కల్యాణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
Image result for ఒంటిమిట్ట
ఇక రాత్రి 8 గంటలకు  కల్యాణం నిర్వహించాల్సి ఉండడంతో సాయంత్రం 6 గంటల నుంచే భక్తులను అనుమతించారు. భక్తులతో గ్యాలరీలన్నీ నిండిపోయాయి. కానీ ఇదే సమయంలో ఒక్కసారే ప్రకృతి కన్నెర్రచేసింది.. రాకాసి గాలుల రూపంలో విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులతో గాలి వాన మొదలైంది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. పెనుగాలులకు గ్యాలరీ కూలి దాని రేకులు, ఇనుప కమ్మీలు భక్తులపై పడడంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 
Image result for ఒంటిమిట్ట చంద్రబాబు
గంటకుపైగా భారీ వర్షం కురిసింది ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కడప చేరుకున్న సీఎం చంద్రబాబు వర్షం కారణంగా ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో బస చేశారు. కళ్యాణం చూసేందుకు వచ్చిన వేలాది భక్తులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురు గాలుల దాటికి భారీ ఫ్లెక్సీలు, టెంట్లు చెల్లా చెదరయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Image result for ఒంటిమిట్ట చంద్రబాబు
ఒంటిమిట్ట ఆలయంలో అంధకారం అలముకుంది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత సీఎం చంద్రబాబు వేడుకలకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు.  అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: