పాపం ఏనాటికైనా పండవలసిందే. ప్రజలపై  పక్కదేశాలపై అవాంచిత కార్యక్రమాలు నిర్వహించే ఏ వ్యక్తైనా, ఏ దేశమైనా దాని దుష్ఫలితలు అనుభవించక తప్పదు. భారత్ నుండి అన్యాయార్జితమైన భూభాగం పాక్ ఆక్రమిత కశ్మీర్ –  సరిహద్దులలో  పాక్ ప్రభుత్వం ప్రోత్సాహంతో, ఐ ఎస్ ఐ  సహకారంతో,  పాక్ సైన్యం భారత్ పై  సృష్టిస్తున్న నరమేధం ఇప్పుడు 'పిఓకె'  ప్రజల నుండి పాక్ సైన్యానికే కష్టాలు ఎదురౌతున్నాయి. రోజు రోజుకి పిఓకే ప్రజల ఆగ్రహానికి సైన్యం గురవ్వకతప్పటం లేదు.
Image result for intensified internal war in POK against its army
పీవోకే లో పాకిస్థాన్ ప్రభుత్వ పాపం పండుతోంది. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పీవోకే సరిహద్దు వెంట పలు ఆర్మీ పోస్టులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పాక్ ఆర్మీపై ఎదురుదాడికి దిగారు.  పీవోకే వెంట అటు భారత సైన్యం, ఇటు సరిహద్దు గ్రామాలపైకి పాక్ సైన్యం కాల్పులు జరపడం, మోర్టార్ షెల్స్ దాడులతో విరుచుకు పడటం నిలిపేయాలని కొన్ని రోజులుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మార్చి 31 నాడు ఈ నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. ర్యాలీలు, ఆందోళనలతో ముజఫరాబాద్‌ తో పాటు పీవోకే ప్రాంత మంతా ఉద్రిక్తంగా మారింది. తాజా ఘటన పాకిస్థాన్ ప్రతిష్టను మరింత దిగజార్చేలా ఉంది. ప్రపంచం ముందు ఆ దేశాన్ని మరోసారి దోషిగా నిలబెట్టింది.
Image result for intensified internal war in POK against its army
పాకిస్థాన్ సైన్యం తమను పావులుగా వాడుకుంటోందంటూ పీవోకే ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తు న్నారు. పీవోకే వెంట పలు గ్రామాల్లో సాధారణ ప్రజల ఇళ్ల లోంచి పాక్ సైన్యం, భారత్‌ పైకి కాల్పులకు పాల్పడుతోంది. మోర్టార్ షెల్ దాడులతో విరుచుకుపడు తోంది. దీనికి ప్రతిగా భారత సైన్యం కూడా దీటుగా స్పందిస్తోంది. అయితే, భారత్ ప్రతిఘటన తో పిఓకే లోని  సాధారణ ప్రజలే పావు లుగా మారుతున్నా రు. పాక్ కాల్పులకు ప్రతిగా భారత సైన్యం చేస్తున్న ప్రతిదాడి కారణంగా పీవోకేలో పలువురు సాధారణ ప్రజలు క్షతగాత్రులుగా మారు తున్నారు. నిత్యం దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి భారత్ ఒక నిర్ణయానికి వచ్చి, భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పెద్ద దాడులకు పాల్పడితే, ఆ ప్రాంతంలో చాలా మంది సామాన్యులు సమిధలయ్యే ప్రమాదం ఉంది.
Image result for people in pak occupied kashmir questioning army for peace
కుతంత్రాలకు, కుటిల నీతికి ప్రజలను సైతం బలిపెట్టే పాక్ ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటోంది. ఒకవేళ అలాంటి దాడి జరిగి పెద్ద సంఖ్యలో పౌరులు మృత్యువాత పడితే దాన్ని ప్రపంచానికి భూతద్దంలో చూపెట్టి భారత్ ను ముద్ధాయిగా చూపి అంతర్జాతీయ సమాజం ముందు లబ్ధి పొందాలని చూస్తోంది. పాక్ ప్రభుత్వ కుట్రపూరిత ప్రణాళిక కారణంగా, నానాటికీ సామాన్యులే సమిధలవుతుండటం పీవోకే ప్రజలకు మింగుడుపడటం లేదు. పాక్ సైన్యంచర్యలతో 70ఏళ్లుగా తాము తీవ్రంగా నష్టపోయామ ని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. "జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ - జేకేఎల్‌ఎఫ్" ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు పాక్ సైన్యంపై ఆందోళనకు దిగారు. 
Image result for people in pak occupied kashmir questioning army for peace
"తానొకటి తలిస్తే దైవం మరొలా తలుస్తాడనే విధంగా", ఆందోళనకారులను పాక్ సైన్యం తీవ్రంగా అణచివేస్తోంది. లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్, పెల్లెట్స్ ప్రయోగిస్తూ నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. శుక్రవారం జరిగిన ఘటనల్లో పలువురు సామాన్యులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పీవోకే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచు కుంది.
Image result for people in pak occupied kashmir questioning army for peace
భారత్‌ను ఇరుకున పెట్టాలనే కుటిల వ్యూహంతో కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్న పాక్, చివరికి అదే చర్యకారణంగా ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నిలబడా ల్సి వస్తోంది. తాజా ఘటనలు అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడ్డాయి. ఈ అంశంపై కొన్ని పత్రికలు ఇప్పటికే ప్రత్యేక కథనాలను ప్రచురించాయి.  భారత్ కూడా ఈ అంశాన్ని సమర్థంగా వాడుకొని అంతర్జాతీయ వేదికలపై పాక్ తీరును ఎండగట్టే అవకాశాలున్నాయి. పాకిస్థాన్‌కు జిందాబాద్ కొడుతూ కశ్మీర్‌ లోయలో తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతున్న యువత ఇకనైనా వాస్తవం తెలుసుకుంటుందా? జమ్మూ కశ్మీర్ యువత పిఓకె యువత నుంచి ప్రేరణ పొందాల్సిన అవసరమెంతైనా ఉంది. వారిలో ఆ మార్పు వస్తుందా? చూడాలి మరి! 

Image result for people in pak occupied kashmir questioning army for peace

'Pakistan occupied Kashmir POK  wants to be a part of India than Pakistan 

మరింత సమాచారం తెలుసుకోండి: