మనిషి ఎంత విజ్ఞానంతో ముందుకు సాగుతున్నా కొన్ని సార్లు వాటితో పెను ప్రమాదాలు సంబవిస్తుంటాయి. అంతరిక్షంలో మానవుడు ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు.  చంద్రమండలంలో అడుగు పెట్టిన తర్వాత అంతరిక్షపై ప్రయోగాలు విపరీతంగా పెరిగిపోయాయి.  అయితే కొన్ని సార్లు ఆ ప్రయోగాలు వికటించడం వల్ల ఎన్నో నష్టాలు కూడా జరిగాయి.  అప్పట్లో స్కైలాబ్‌ భూమిపై పడి భూమి నాశనం అవుతుందని పుకార్లు రావడంతో ప్రజలు ఎంతో ఆందోళన పడ్డారు. 
 ఆ మూడు మహానగరాల్లోనేనా?
ఈ మద్య ఇలాంటి వార్తే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. చైనా స్పేస్ ల్యాబ్ అదుపు తప్పి భూమిపై పడుతుందని..దాని వల్ల ఎంతో నష్టం జరుగుతుందని పుకార్లు వచ్చాయి.  కానీ..చైనా స్పేస్ ల్యాబ్ కథ సుఖంతం అయ్యింది. చైనా స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-1 భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 15 నిమిషాలకు దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే మంటలు చెలరేగినట్టు చైనా అంతరిక్ష అధికారులు తెలిపారు.  

Image result for స్కైలాబ్‌గా

దక్షిణ అట్లాంటిక్‌, బ్రెజిలియన్ తీర ప్రాంతంలోని సావో పాలో, రియో డీ జెనీరో ప్రాంతాల్లో ఈ స్పేస్ ల్యాబ్ కూలిపోనున్నట్టు అంతకుముందు శాస్త్రవేత్తలు ప్రకటించారు.   10.4 మీటర్ల పొడవున్న తియాంగాంగ్-1ను 2011లో చైనా ప్రయోగించింది. 2013లో దీని సేవలను నిలిపివేయాలని అనుకున్నా తర్వాత దానిని పొడిగించారు. ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రం 2017 చివరిలోనే కూలిపోతుందని తొలుత భావించారు.
Image result for స్కైలాబ్‌గా
కానీ అది కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి మార్చి, ఏప్రిల్ లో మొదటి వారంలో ఇది కూలిపోతుందని ప్రకటించారు.  ఇది దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే చైనా  తియాంగాంగ్-1 ఆవేదన వ్యక్తం చేసింది..ఇది కేవలం స్పేస్ క్రాఫ్ట్ మాత్రమేనని, అయినప్పటికీ అధిక ప్రాధాన్యం   చైనా స్పేస్ ఇండస్ట్రీని దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: