సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే..శీతలపానియాల వైపు పరుగెడుతుంటారు జనాలు.  ఎండ తాపానికి తట్టుకోలేక కూల్ డ్రింగ్ తాగుతూ మంచు కొండల్లో విహరించినంతగా ఫీల్ అవుతుంటారు.  కర్బూజా, తర్బూజా, నిమ్మరసం, చెరకు రసం, బత్తాయి, మజ్జిగ లాంటి శీతలత్వాన్ని వంటికి సమకూర్చేవి ఎన్ని ఉన్నా చాలా మంది వివిధ రకాల కూల్ డ్రింగ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. 

ఇంట్లో ఎవరైనా గెస్ట్ లు వచ్చినా..చల్లని మజ్జిక ఇవ్వకుండా కూల్ డ్రింగ్ తెప్పించి ఇవ్వడం ఈ మద్య ఫ్యాషన్ అయ్యింది.  కొబ్బరి బొండాలు మనిషికి ఎంతో చలువ ఇస్తాయని తెలిసినా..వాటిని పక్కన బెట్టి కూల్ డ్రింగ్స్ వైపే పరుగెడుతుంటారు. ఇక కూల్ డ్రింగ్స్ వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిసి కూడా దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.

అంతే కాదు అప్పుడప్పుడు కూల్ డ్రింగ్ బాటిల్స్ లో బొద్దింకలు,ఇతర క్రిమికీటకాలు వస్తున్నాయని ఎన్నో సార్లు సోషల్ మీడియాలో చూశాం. తాజాగా   కోక్‌ బాటిల్‌ కొన్న వ్యక్తికి దానిలో చచ్చిన ఎలుక వచ్చింది. అర్జెంటీనాకు చెందిన డియాగో పెరియా అనే వ్యక్తి తాను కొన్న కోక్‌ బాటిల్‌లో ఏదో ఉన్నట్లు అనిపించింది. అదేంటో తెలుసుకోవడం కోసం బాటిల్‌లో ఉన్న కోక్‌ను ఒక గ్లాసులోకి పోశాడు.

అప్పుడు బాటిల్‌లో అతడికి చచ్చిన ఎలుక కనిపించింది.  దాంతో ఈ తతంగం అంతా ఓ వీడియో తీసి తాను కోక్‌ బాటిల్‌లో ఎలుకను చూడటం ఇది రెండోసారి అంటూ సోషలో మీడియాలో పోస్టు చేశాడు. కానీ కంపెనీ మాత్రం ఈ విషయం గురించి ఏమి మాట్లడలేదు. కొన్ని సార్లు ప్యాకింగ్‌ సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది కాస్తా  వినియోగదారుల ప్రాణాల మీదకు తెస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: