పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి తమిళనాడు రాష్ట్రంలో కావేరి వివాదం నడుస్తుంది.  కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఏడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాహారదీక్షను చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్రం కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తూ దీక్షకు దిగారు.

ఈ నేపథ్యంలో చెన్నైలోని చేపాక్ లో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు నిరాహారదీక్షలో పాలుపంచుకున్నారు. ఈ రోజు ఉదయం దీక్షా ప్రాంగణానికి చేరుకోవడంతో వీరిని చూసి పార్టీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ముందుగా రూపొందించిన దీక్షలో పాల్గొనే అన్నాడీఎంకే నేతల జాబితాలో వీరి పేర్లు లేవు. కానీ ఉన్నట్టుండి దీక్షా వేదిక వద్దకు వీరిద్దరూ వచ్చి నిరాహార దీక్షలో పాల్గొనడంతో అంతా ఖంగుతిన్నారు.

వాస్తవానికి నిరాహారదీక్ష చేపడుతున్న వ్యక్తుల జాబితాలో వీరిద్దరి పేర్లు లేవు. కానీ ఈ ఉదయం 8.15 గంటలకే నిరాహారదీక్ష వేదిక వద్దకు చేరుకున్న వీరు... దీక్షలో కూర్చున్నారు.  కాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిరాహారదీక్షలో పాల్గొనడంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మండిపడ్డారు.
Image result for tamil nadu stalin
ఆరువారాల్లోగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: