మోడీపై రానురాను దేశంలో అసహనం నెలకొంటుంది. సొంత బిజెపి పార్టీ నేతలే మోడీ పై బయట బాగానే ఉన్నా లోలోపల విరుచుకుపడుతున్నారు. పార్టీలో  ఏకపక్ష ధోరణితో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం...వంటి చర్యలు బిజెపి నేతలకు అస్సలు మింగుడుపడటంలేదు. అయితే ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

Image result for modi

ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ వ్యవహరిస్తున్న తీరు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయం ఈ ఎన్నికలలో బిజెపి పార్టీకి తూట్లు పొడిచేటట్టు ఉంది అని అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. కర్నాటక రాష్ట్రంలో ఎక్కువగా తెలుగువారు ఉన్నారు. ఈ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సెటిల్ అయిన తెలుగువారు ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించనున్నారు.

Related image

ఇప్పటికే వీరంతా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టేసారు. ఒకవైపు తెలుగు ప్రజల వ్యతిరేక ప్రచారం… మరోవైపు కాంగ్రెస్ నేత ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య వేస్తున్న ఎత్తులతో ప్రధాని మోడికి చుక్కలు కనిపిస్తున్నాయి. సిద్దూ వ్యూహాలకు బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో మోడీకే సవాల్‌ విసురుతున్నారు సిద్ద రామయ్య. ప్రచారంలో మోడీపై ఆయన తీవ్రస్థాయిలోనే విరుచుకుపడుతున్నారు.

Related image

రాజకీయ పరిశీలకులు సైతం మోడీ వర్సెస్‌ సిద్దూ అనే వాతావరణం నెలకొందని, సీఎం వ్యూహాలకు బీజేపీ బేజారిపోతోందని అంటున్నారు. అంతేకాకుండా మోడీ తీసుకున్న నిర్ణయాలలో జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలు ప్రజలలో  విఫలమవడంతో మోడీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో కర్ణాటక ఎన్నికలలో కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఇచ్చే తీర్పు మోడీ పతనానికి నాంది అని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: