ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఓ మహిళ కలకలం సృష్టించింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాధమిక విచారణలోనూ ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. విచారణలో ఆమె చెప్పిన వివరాలు విన్నపోలీసులకు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. 



ఓసారి తాను సీబీఐ అధికారిణి అంటూ సదరు మహిళ హల్ చల్ చేసింది. మరో సారి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ భార్యనని చెప్పింది. ఇలా మాటకు మాటుకు పొంతన లేకుండా సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు తలపట్టుకున్నారట. ఆమెను తనిఖీ చేయగా ఆమె వద్ద ఓ ఐడీ కార్డు దొరికింది. అందులో ఆమె పేరు ఎ.ఎర్విన్ రీటా అని ఉంది. 

Shocking: Suspicious woman wandering at AP CM residence

అంతే కాదు.. ఆ కార్డు ప్రకారం ఆమె స్పెషల్ సిబిఐ జాయింట్ ఇంటర్నేషనల్ హోదాలో పనిచేస్తోందన్నమాట. కానీ అసలు అలాంటి సంస్థ ఒకటి ఉందా.. లేదా నకిలీ ఐడీ కార్డు తయారు చేయించుకుందా అన్నది అర్థంకావడం లేదు. మరోవైపు ఆమె మతిస్థిమితం లేకపోవడం వల్ల ఇలా చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐతే చంద్రబాబుకు నక్సల్స్ నుంచి ముప్పు ఉండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. 


ఇటీవల కాలంలో చంద్రబాబు, లోకేశ్ లపై సీబీఐ విచారణ జరగవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో సీబీఐ అధికారిణి అంటూ సదరు మహిళ చెప్పడం కూడా కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో చంద్రబాబు నివాసం వద్ద మరింత భద్రత పెంచారు. మహిళను తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: