జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబును హెచ్చరించారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఇదే తరహాలో వ్యవహరిస్తే.. ముందు ముందు రాయలసీమ, కళింగ ఉద్యమాలు రావచ్చని వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కిరంచారు. గతంలో హైదరాబాద్ లో చేసిన తప్పే మళ్లీ చంద్రబాబు అమరావతిలో చేస్తున్నారని విమర్శించారు. 

Image result for evari rajadhani amaravathi book

ఓ రాష్ట్రానికి రాజధాని అంటే అన్ని జిల్లాల వాళ్లూ అది తమది అని ఫీలయ్యేలా ఉండాలని.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని పవన్ కల్యాణ్ అంటున్నారు. 
అబివృద్ది అంతా రాజధాని కేంద్రంగా కేంద్రీకృతం కావడం ప్రమాదమని గతంలో హైదరాబాద్ విషయంలో ఇదే జరిగిందని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు గుర్తు చేశారు. ఈ ధోరణి వల్ల మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 


అధికారంలో ఉన్నవారు చేస్తున్న తప్పిదాలు, అసమానతల వల్ల అస్థిత్వ పోరాటాలు ప్రారంభమవుతాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అమరావతిని  ఐదు, పది సంవత్సరాల్లో నిర్మిస్తామని చెబుతున్నారు...  కానీ అది అసాధ్యమని పవన్ అన్నారు. తాను మళ్లీ మళ్లీ చెబుతున్నానంటూ.. రాత్రికి రాత్రి మహానగరాలను నిర్మించలేరన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని చురకలు వేశారు పవన్. 


రాజధాని కోసం మొదట్లో మంగళగిరిలో అటవీ భూమి 1800 ఎకరాలు తీసుకుంటే సరిపోతుందని చంద్రబాబు చెప్పారని.. ఆ తర్వాత 30 వేల ఎకరాల వరకూ సేకరించారని పవన్ విమర్శించారు.వాస్తవానికి అంత పెద్ద రాజధాని అవసరం లేదని..  పరిపాలన నగరం ఉంటే సరిపోతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: