ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షనేత జగన్ వద్దకు రాయబారం పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించాలని నిర్ణయిచారట. ఇంతకీ ఈ రాయబారం ఎందుకోసమో తెలుసా.. శనివారం అఖిలపక్ష సమావేశానికి తప్పకుండా రావాల్సిందిగా కోరేందుకట. ఇటీవల ఏపీ సర్కారు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ రాలేదు. 


అప్పట్లో కేవలం కొన్ని గంటల ముందే అఖిపక్షం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానించే అవకాశం లేకుండాపోయింది. దాంతో వైసీపీ కూడా ఆ మీటింగ్ కు డుమ్మా కొట్టింది. అందుకే ఈసారి పిలవలేదని తమ వైపు తప్పులేకుండా చూసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా మంత్రులు వెళ్లి పిలిచినా జగన్ అఖిలపక్ష సమావేశానికి వచ్చే అవకాశాలేలేవు. 


తాము టీడీపీ నిర్వహించే అఖిలపక్షానికి వచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే ఆ పార్టీ తేల్చి చెప్పింది. ఎలాగూ పిలిచినా రారు కాబట్టి మంత్రులను పంపించి.. ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణియించారు. తాము అందరినీ కలుపుకుపోదామని ప్రయత్నిస్తున్నా వైసీపీ కలసిరావడం లేదని ప్రజలకు చెప్పేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నది టీడీపీ ప్లాన్. 


చంద్రబాబు తమ వద్దకు మంత్రులను పంపబోతున్నారన్న వార్త వైసీపీలోనూ కలకలం రేపుతోంది. ప్రభుత్వం తరపు వచ్చి ఆహ్వానించినా రాలేదని అంటారేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అయితే తాము ముందే క్లారిటీగా చెప్పాం కాబట్టి చంద్రబాబు నక్కజిత్తులను ప్రజలు అర్థం చేసుకుంటారని వైసీపీ భావిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: