ప్రస్తుతం రాష్ట్రంలో మరియు దేశ రాజధాని ఢిల్లీలో  ప్రత్యేకహోదా నిరసన సెగలు అట్టుడుకుతున్నాయి. ప్రత్యేక హోదాకు  సంబంధించి ఏప్రిల్ 7వ తేదీ వరకు కేంద్రం ఎటూ తేల్చకపోతే తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటామని చెప్పిన వైసీపీ ఎంపీలు అన్నట్లుగానే రాజీనామాలు చేసి ఢిల్లీలో నిరాహారదీక్షకు కూర్చున్నారు.


అయితే ఎప్పటికప్పుడు సమయాన్ని, పరిస్థితిని సమీక్షించుకుంటూ ఆచితూచి అడుగువేస్తున్న బాబుకు జగన్ ఎత్తుగడలు అంతుచిక్కడం లేదు. బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగించేటప్పుడు, అసలు బీజేపీ హోదా కానీ ప్యాకేజీ ఇవ్వకుండా ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శించేవాడు. అసలు రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తున్నదని తెలిసినా టీడీపీ వారితో ఎందుకు కలిసున్నదని తన ప్రసంగాలలో చెబుతూ ప్రజలలో టీడీపీపై వ్యతిరేఖ భావాలను కలిగించేలా చేసాడు.


బీజేపీతో టీడీపీ పొత్తు విరమించుకున్న తరువాత హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని చెప్పి బాబుకు సవాలు విసిరాడు. ఇలా ఒకదానివెంట ఒకటి సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజలలో వైసీపీని దూసుకెళ్ళేలాచేసి టీడీపీని వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త వ్యూహాలు అనుసరించకపోతే ఓటమి తప్పదన్న భయంతో ఢిల్లీలో హోదాపై పోరాడుతున్న  తన ఎంపీలను రాష్ట్రానికి తిరిగి వచ్చేయాలని బాబు ఆదేశించాడు. ఢిల్లీలో హోదాపై చేసిన నిరసనని వాడుకుని రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని ఆయన నిర్ణయించాడు. దీనికి సంబంధించి  రూట్‌మ్యాప్‌ను తయారుచేసేందుకు  వారందరు అమరావతికి రావలసిందిగా  ఆయన నిన్న జరిపిన టెలీకాన్ఫరెన్సులో సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: