క‌న్న‌డ ఎన్నిక‌ల్లో తెలుగు నేత‌ల హ‌డావుడి పెరుగుతోంది. క‌ర్ణాట‌క‌లో సిర్థ‌ప‌డిన తెలుగు ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఓ వైపు ప్ర‌త్యేక హోదా, రాష్ట్ర విభ‌జ‌న హామీలు అమ‌లు ప‌ర్చ‌ని నేప‌థ్యంలో ర‌గులుతోన్న తెలుగు త‌మ్ముళ్లు అక్క‌డ బీజేపీని ఓడించాల‌ని ఇన్ డైరెక్టుగాను, డైరెక్టుగాను ప్ర‌చారం మొద‌లెట్టేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జేడీఎస్ త‌రుపున ప్ర‌చారం చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Image result for pawan chiru

ఇలా ఇద్ద‌రు నేత‌ల ప‌ర్య‌ట‌న‌పై కొద్దిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గానే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం ఆయ‌న క‌ర్ణాట‌క వెళ్లి మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో భేటీ అయ్యారు. అనంత‌రం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మాచారంలో తెలుగు ప్ర‌జ‌లు జేడీఎస్‌ను గెలిపించాల‌ని కోరారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పిన కేంద్రంలోని బీజేపీపై టీడీపీ, వైసీపీ, వామ‌ప‌క్షాలు, జ‌న‌సేన‌, ప్ర‌జాసంఘాలు ఉద్య‌మిస్తున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న ఉద్య‌మంలో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం అవ‌తున్నారు. 

Image result for kcr devagouda

అయితే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించాల‌ని అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల‌ను టీడీపీ నేత‌లు కోరుతున్నారు. క‌ర్ణ‌టాక‌లోని బ‌ళ్లారి, త‌దిత‌ర ప్రాంతాలు, ఏపీ స‌రిహ‌ద్దు జిల్లాల్లో తెలుగు ప్ర‌జ‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేసిన బీజేపీని ఓడించాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుగు యువ‌త జోరుగా ప్ర‌చారం చేస్తోంద‌ని స‌మాచారం. ఇదేస‌మ‌యంలో ఏపీ డిప్యూటీ సీఎం విష్ణుమూర్తి కూడా బీజేపీ ఓడించాల‌ని పిలుపునిచ్చారు.

Image result for karnataka elections

తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించడం, జేడీఎస్ నేత‌లు దేవేగౌడ, కుమార‌స్వామిల‌తో స‌మావేశం కావ‌డం.. అనంత‌రం జ‌రిగిన విలేక‌రుల‌తో స‌మాశంలో కాంగ్రెస్‌, బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం.. ఇదే స‌య‌మంలో జేడీఎస్‌ను గెలిపించాల‌ని అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల‌ను కోర‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అయితే చిరంజీవి మాత్రం కాంగ్రెస్ త‌రుపున ఏపీ స‌రిహ‌ద్దు జిల్లాల్లో జ‌రిగే స‌భ‌ల్లో పాల్గొన‌డం దాదాపుగా ఖ‌రారైంది. ఇక మిగిలిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ ఎవ‌రికి ఓటేయాల‌ని పిలుపునిస్తారోన‌ని రెండు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: