ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన కేంద్రంపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రకాలుగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో మరో ఊహించని ఎత్తు వేసి ఆశ్చర్యపరిచారు చంద్రబాబు.

Image result for SPECIAL STATUS

          కేంద్రంలోని మోదీ సర్కార్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన వాటిపై తాత్సారం ప్రదర్శిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. విభజనచట్టంలోని హామీలు నెరవేర్చకుండా.. రాష్ట్రానికి రావాల్సిన వాటిపైనా కేంద్రం శీతకన్ను వేస్తోందనేది ఆయన చెప్తున్న మాట. నాలుగేళ్లపాటు న్యాయం చేస్తారని వెయిట్ చేశామని, ఇక ఎంత మాత్రం ఎదురు చూసే పరిస్థితి లేదని ఆయన స్పష్టంచేశారు. మోదీ కేబినెట్ కు గుడ్ బై చెప్పడంతో పాటు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి హడావుడి చేశారు. అయితే ఆ తీర్మానం చర్చకు రాకుండా బీజేపీ తప్పించుకుంది.

Image result for SPECIAL STATUS

          అవిశ్వాస తీర్మానం పెట్టినా, రాష్ట్రంలో పలు రకాల ఆందోళనలు చేపట్టినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు సరికదా రివర్స్ అటాక్ చేస్తోంది. దీంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఓ రోజు స్వయంగా తానే దీక్ష చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకు తన పుట్టినరోజునే ఎంచుకున్నారు. ఏప్రిల్ 20న తిరుపతిలో రోజంతా నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. చంద్రబాబు దీక్షతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకోనున్నారు. ఇప్పటికే రెండ్రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబును చూసి బీజేపీ హడలెత్తిపోయింది. ఆయన ఇంటర్వ్యూలను టెలికాస్ట్ చేయొద్దంటూ నేషనల్ ఛానళ్లను ఆదేశించింది.

Related image

          చంద్రబాబు తాజా నిర్ణయం రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. అంతేకాక.. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని నిర్ణయాలు ఉంటాలని చంద్రబాబు స్పష్టంచేశారు. కేంద్రాన్ని తామే శాసించబోతున్నామని తేల్చి చెప్పారు. పాతిక ఎంపీ సీట్లు గెలిపిస్తే బీజేపీ తమ స్తతా ఏంటో తెలుస్తుందన్నారు. ఆంధ్రాతో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో త్వరలోనే తెలిసొస్తాయని చంద్రబాబు హెచ్చరించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: