హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో జాతీయ స్థాయి దివ్యాంగుల టీ-20 క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది.  జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీకి ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. శనివారం ఈ టోర్నీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. దివ్యాంగులైన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు.
Pawan participates as guest in a tournament for the physically challenged
దివ్యాంగులంతా బాగా ఆడాలని, ప్రజలను ఆకట్టుకోవాలని అన్నారు. ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టుకు రూ. లక్ష ఇస్తానని చెప్పారు.  టోర్నీ కోసం రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు పవన్. మిమ్మల్ని ప్రేమిస్తే దేశాన్ని ప్రేమించినట్లేనని అన్నారు. దివ్యాంగుల కోసం సెప్టెంబర్‌లోగా రూ. కోటి కార్పస్ ఫండ్ స్నేహితులను అడుగుతానని పవన్ చెప్పారు.

క్రికెట్ తాను తక్కువగా చూస్తానని అన్నారు. నవజోత్ సింగ్ సిద్ధు బాగా ఆడేవారని..ఆయన ఆడినంత కాలం క్రికెట్ చేశానని తర్వాత చూడలేదని అన్నారు. ఈ పోటీలకు దేశంలోని 24 రాష్ట్రాల నుంచి టీములు హాజరయ్యాయి. ఆటగాళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు  ఇక తొలి టీ-20 మ్యాచ్ తెలంగాణ, వడోదర జట్ల మధ్య జరగబోతోంది.

జాతీయ స్థాయిలో ఈ టోర్నమెంట్ జరగడం ఇది రెండోసారి. దివ్యాంగుల టీ-20 టోర్నీ ప్రారంభోత్సవానికి హాజరైన పవన్ ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పవన్ మాట్లాడుతున్న సమయంలో స్టేడియంలో సీఎం సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: