గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం మూటగట్టుకున్న తరువాత జగన్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తాను గెలుస్తానని ఆశించినప్పటికీ ఒక్కసారిగా సమీక్షలు మారడంతో పరాజయం తప్పలేదు. కానీ ఈ సారి ఎలాగైనా గెలవాలని నానాతంటాలు పడుతున్నాడు. ఇప్పటికే పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో కావలసిన మద్దతును కూడగట్టాడు.


ప్రస్తుతం ఆయన చేపట్టిన పాదయాత్ర నేటితో 136వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లాలో ముగిసిన యాత్ర నేడు కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర ఆయన యాత్ర చేయనున్నాడు. కనకదుర్గ వారధి గుండా యాత్ర చేస్తూ ఆయన కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టాడు. దారి పొడవునా అభిమానులతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది.


అయితే నేడు పాదయాత్రలో అనూహ్య సంఘటన జరిగింది. జగన్ యాత్ర అవడం మూలాన అక్కడి దుర్గమ్మ వారధి పై భారీగా అభిమాన సందోహం చేరడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా విశేషమేమంటే అటువైపుగా గుంటూరు వెళ్తున్న టీడీపీ మంత్రి కళావెంకట్రావు అక్కడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఈ జనసందోహంలో మీరు ఇరుక్కుపోయారుగా మీ స్పందన ఏంటంటూ మీడియా ప్రతినిధులు ఆయనను అడగ్గా రద్దీ ఎక్కువవడంతో అందరితో పాటు మనం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం అని తెలిపారు తప్ప, జగన్ యాత్రవల్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది అని చెప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: