తెలుగు సినిమా రంగాన్ని క్యాస్టింగ్ కౌచ్ విషయం కుదిపేస్తుంది. ఇదే విషయంపై సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు కొంత మంది హీరోయిన్లకు మాటల మధ్య తేడాలు కూడా వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఇదే విషయంపై ప్రముఖ హేతువాది బాబు గోగినేని స్పందించారు. ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా చలామణి అయ్యే వారు క్యాస్టింగ్ కౌచ్ పై ఎందుకు స్పందించారు అంటూ ప్రశ్నించారు.

Image result for pawan kalyan vs gogineni babu

ఎన్నో కలలు కని ఇండస్ట్రీ కి వస్తున్న అమ్మాయిలను వారి జీవితాలను వాడుకోవడం సబబేనా అంటూ మండిపడ్డారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు దేశంలో పోలీస్ స్టేషన్లు న్యాయ స్థానాలు ఉన్నాయి  ముందు అక్కడ ఫిర్యాదు చేసి తర్వాత న్యాయం జరగకపోతే బాధితురాలు ఏవిధంగా అయిన నిరసనలు చేయవచ్చు.

Image result for pawan kalyan and gogineni babu

అయితే పాపులర్ అవాలనే ఉద్దేశ్యంతో చేస్తే మాత్రం సమాజాన్ని పాడుచేసినవారమవుతాం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై గోగినేని స్పందించారు. పోలీస్ స్టేషన్లు - కోర్టుల్లో ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని పవన్ చెప్పడంతో తాను కూడా అంగీకరిస్తున్నానని.. అయినా సినీ పెద్దలు దీనిపై స్పందించాల్సిన అవసరం మాత్రం ఉందన్నారాయన.

Image result for pawan kalyan

ఎంతోమంది ఆడవారు ఇండస్ట్రీలో మోసపోతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. అలాగే ఆడవారి గురించి రాజకీయ వేదికలలో...సినిమా కార్యక్రమాలలో మర్యాదగా మాట్లాడేవారు...ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు మాట్లాడారంటూ మండిపడ్డారు బాబు గోగినేని.

మరింత సమాచారం తెలుసుకోండి: