జగన్ పాదయాత్ర రాజధానికి చేరింది. అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం ఎదురైంది. అంతవరకూ బాగానే ఉంది. ఆశించిన దాని కన్నా ఎక్కువ జనమే వచ్చారు. దీంతో వైసీపీ టీమ్ ఫుల్ ఖుషీ అయ్యింది. అయితే ఆ ఆనందం సరిపోలేదో ఏమో వైసీపీ సోషల్ మీడియా టీమ్ చేసిన ఓ పిచ్చిపని ఆ పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేసింది. జగన్ పాదయాత్రకు జనాన్ని రానివ్వకుండా పోలీసులు కొడుతున్నారంటూ వైసీపీకి చెందిన సోషల్ మీడియా ప్రచారం చేసింది. 


ఇందుకు సాక్ష్యంగా జనాన్ని పోలీసులు కొడుతున్న వీడియోలు పోస్టు చేసి హంగామా చేశారు. వైసీపీ సోషల్ మీడియా టీమ్ ప్రచారంతో దిమ్మతిరిగిన టీడీపీ సోషల్ మీడియా ఆ వీడియోపై దృష్టి సారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. అదో పాత వీడియో. భారత్ బంద్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనను విజయవాడలో జరిగినట్లు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసినట్లు తేలింది. 



ఇంత జరిగాక ఇంకా అధికార పార్టీ టీడీపీ ఊరుకుంటుందా.. ఈ మొత్తం వ్యవహారంపై కేసు పెట్టేసింది. పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్  దీనిపై సత్వరం విచారణ చేయాలని.. ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ జరిపిన పోలీసులు విజయవాడలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని నిర్దారించారు. తప్పుడు వీడియోను ఫేస్ బుక్ లో కొందరు  దీన్ని ప్రచారం చేస్తున్నట్లు డిసైడ్ చేశారు. 


తప్పుడు వీడియోలు ప్రసారం చేసి ప్రభుత్వం, పోలీసులపై దుష్క్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదీ అసలు కథ. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: