తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉద్యోగాన్ని సైతం పక్కనబెట్టి తెలంగాణ సాధన కోసం నడుం బిగించారు ప్రొఫెసర్ కోదండరాం.  పల్లె పల్లెన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపిన కోదండరాం అన్ని వర్గాలను కలుపుకొని పోయారు.  పార్టీలకు అతీతంగా తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆయన జరిపిన ఉద్యమం ప్రస్తుత సీఎం కేసీఆర్ కొనియాడారు. 
Image result for prof kodanda ram
మొత్తానికి యూపీఏ హయాంలో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు.  ఆ తర్వాత కేసీఆర్ కి కోదండరాం కి మద్య విభేదాలు తలెత్తాయి.  అందరికీ ఉద్యోగం..బడుగు బలహీన వర్గాలకు ఆదుకుంటారని ప్రజలు నమ్మారని..కానీ తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు చేస్తామని చెప్పగా ఎన్నో అభ్యంతరాలు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం.
Image result for prof kodanda ram
ఈనెల 29న సరూర్ నగర్ గ్రౌండ్‌లో జరగనున్న సభకు 3 రోజుల్లో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పొల్యూషన్ కారణంగా నగరంలో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు ఆనందం వ్యక్తంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: