ఉత్తరాంధ్ర అంటే టీడీపీ కు కంచు కోట అని చెప్పవచ్చు. పోయిన ఎన్నికల్లో జగన్ ఓడి పోవడానికి , బాబు గెలవడానికి ఈ ఉత్తరాంధ్ర నే కారణం అని చెప్పవచ్చు . ఎందుకంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ. ఇప్పుడు జగన్ పాదయాత్ర కృష్ణ జిల్లాలో ని విజయవాడ లో సాగుతుంది. అయితే జగన్ పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. దింతో బాబుకు కలవరపాటు ఎక్కువైందని కొందరి నుంచి వినిపిస్తున్న మాటలు. 

Image result for jagan padayatra

 నాలుగేళ్ల నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలా కష్టపడ్డాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనం అయ్యింది అని చెప్పడానికి ఆయన పడ్డకష్టం అంతాఇంతా కాదు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, అనుకూల మీడియా చేత అలుపు లేకుండా దాడులు చేయించారు, తెలుగుదేశం నేతలు అనునిత్యం దుమ్మెత్తిపోశారు. దాని ప్రయోజనాలు ఎక్కడ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి, జగన్ పార్టీలోకి కృష్ణాజిల్లా కమ్మవాళ్లే చేరుతున్నారు.

Image result for jagan padayatra

ఇక స్థానిక కమ్మవాళ్ల నుంచి కూడా జగన్ పాదయాత్రకు సానుకూల స్పందనే వస్తోంది. చంద్రబాబు సంపాదించుకున్న వ్యతిరేకత స్థాయిని చాటి చెబుతోంది జగన్ పాదయాత్ర. అలాకాదు.. అని తెలుగుదేశం వాళ్లు అంటే, అది వాళ్లు వాళ్లను మోసం చేసుకోవడమే. ఈ మధ్యనే అన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించం అని. నిజమే.. ఈయన గుర్తింపు అవసరం లేకపోవచ్చు ఇక. త్వరలోనే ఎన్నికలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. కాబట్టి ఆ గుర్తింపు తెలుగుదేశం పార్టీకి దక్కేలా ఉంది పాదయాత్ర స్పందన.


మరింత సమాచారం తెలుసుకోండి: