రాష్ట్రంలో ప్రత్యేకహోదా కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. స్పెషల్ స్టేటస్ కోసం వైసీపీ ముందు నుంచి పోరాడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో పలు రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ హీట్ ను మరింత పెంచేందుకు జగన్ మరో బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు.

Image result for jagan

          వచ్చే ఎన్నికల వరకూ ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా ఉంచాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ వచ్చినా రాకపోయినా అందుకోసం వచ్చే ఎన్నికల దాకా ఉద్యమం ఆపకూడదనేది ఆయన ఫీలింగ్. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి ఒకే మాట మీద నిలబడింది ఒక్క వైసీపీ మాత్రమేనని జగన్ చెప్తున్నారు. ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేసి ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు లాలూచీ పడ్డారని ఆయన విమర్శిస్తున్నారు. బీజేపీ చెప్పిన కల్లిబొల్లి మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబడుతున్నారు. తాము మాత్రం మొదటి నుంచి స్పెషల్ స్టేటస్ కావాలంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలూ తమ బాటలో వచ్చాయని గర్వంగా చెప్తున్నారు జగన్.

Image result for ycp mlas

          ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వైసీపీ సక్సెస్ అయింది. ముందుగా అవిశ్వాస తీర్మానాలు ఇవ్వడం, ఆ తర్వాత రీజీనామాలు చేయడం, అనంతరం ఆమరణ నిరాహార దీక్ష చేయడం.. ఇప్పుడు ప్రజల్లో ఉంటూ ఉద్యమాలు చేయడం లాంటివి వైసీపీకి కలిసొచ్చాయి. ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా ఉంచడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఎంపీలు చేసిన పోరాటం.. ఆ పార్టీకి ఎంతో మేలు చేసింది. అయితే ఈ టెంపోను ఇప్పుడు ఆపేస్తే వచ్చే ఎన్నికల నాటికి చల్లబడిపోతుందని, ఇంత కష్టపడి అప్పుడు ఫలితాలు రాబట్టుకోలేకపోతే ఉపయోగం ఉండదని జగన్ భావిస్తున్నారు.

Image result for ysrcp mla

          అందుకే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలందరి చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని నిర్ణయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయబోతున్నారు. వచ్చే నెలాఖరుకు జగన్ పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు. అనంతరం ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు. మరి చూద్దాం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో..!


మరింత సమాచారం తెలుసుకోండి: