పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటి పోయింది. అయితే పార్టీ పెట్టి నేను మార్పు కోసం పార్టీ పెట్టాను. కొత్త రాజకీయాలు చేయబోతున్నామని ఆవేశంగా మాట్లాడినాడు. అయితే ఈ నాలుగేళ్లు పవన్ కళ్యాణ్ పార్ట్ రాజకీయాలు చూసిన వారికి పవన్ రాజకీయాలు ఏంటో ఈ పాటికే అర్ధం అయ్యి ఉంటుంది. ఒక పక్క ఆంధ్ర సిఎం ను తిడుతాడు  మరో పక్క తెలంగాణ సీఎం కు భజన చేస్తాడు. ఇదే పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయం అనుకోవాలేమో ..!

Image result for pavan kalyan janasena

'ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయం సాగుతోందనడానికి ఇదే నిదర్శనం' అని అద్దేపల్లి శ్రీధర్‌ అధినేత కొత్త రాజకీయం గురించి గొప్పగా చెప్పారు. నిజమే...పవన్‌ది కొత్త రాజకీయమే. ఇంకా చెప్పాలంటే జనాలకు అర్థంకాని రాజకీయం. తనకే అర్థంకాని రాజకీయం కూడా. జనసేన పార్టీ గుంటూరులో సభ నిర్వహించేవరకు చంద్రబాబుతో అంటకాగిన పవన్‌ ఆ సభలో ఒక్కసారిగా ఆయన మీద, కుమారుడి మీదా విరుచుకుపడి షాకిచ్చారు. 

Image result for pavan kalyan janasena

పవన్‌ కళ్యాణ్‌ మనోడే అనుకున్న బాబుకు ప్రత్యర్థిగా మారారు. నాలుగేళ్లు పార్ట్‌టైమ్‌ రాజకీయాలు చేసిన పవన్‌ ఫుల్‌టైమర్‌గా మారాక కూడా కొందరికి సరిగా అర్థంకావడంలేదు. కేసీఆర్‌ను పొగడటం పవన్‌కు అలవాటు. ఎందుకో తెలియదు. ఆయనంటే భయమా? భక్తా? పవన్‌ సినిమా హీరోగానే ఉన్నట్లయితే కేసీఆర్‌ను ఎంత పొగిడినా చర్చనీయాంశం కాదు. కాని రాజకీయ పార్టీ పెట్టాక 'మీ పాలన బ్రహ్మాండం, అద్భుతం, అమోఘం' అని ప్రశంసించడం ఎందుకు? కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేయడానికి ప్రత్యేకంగా ఆయనింటికి వెళ్లి ప్రశంసించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎవరికీ అర్ధం కాక పొతే ఇక ఓట్లు ఎవరు వేస్తారో..!


మరింత సమాచారం తెలుసుకోండి: