నటి శ్రీరెడ్డి సినిమా రంగంలోని క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్నిబట్టబయలు చేసింది. ఐతే ఇప్పుడు శ్రీరెడ్డి బయటపెట్టింది కానీ.. ఈ విషయం కొన్నేళ్ల క్రితమే బయటపెట్టిన నటి మాధవీలత. అయితే ఫిల్మ్ చాంబర్ ఎదుట నగ్నప్రదర్శన వంటి సాహసాలు మాధవీలత చేయకపోవడం వల్ల అది అంత సంచలనం సృష్టించలేదు. కానీ శ్రీరెడ్డి ఆ సాహసం చేసింది. కానీ ఇప్పుడు మాధవీలత కూడా త్వరలో బాంబులు పేల్చే అవకాశం కనిపిస్తోంది.  

Image result for sri reddy

ఇండస్ట్రీకి సంబంధించిన మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని నటి మాధవీలత బాంబులు పేలుస్తోంది. ఇండస్ట్రీకి సంబంధించిన నిజాలు పవన్ కల్యాణ్ కు తెలుసని.. కానీ ఆయన వెల్లడించడంలేదని తన ఫేస్ బుక్ పేజీలో చెప్పేసింది. అందుకే పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై స్పందించలేదని ఆమె అంటోంది. ఇప్పుడు కూడా తప్పనిసరికాబట్టే ఆయన నోరు విప్పాడని మాధవీలత కామెంట్ చేసింది. 

Image result for sri reddy PAWAN
తాను గతంలో పవన్ కల్యాణ్ ను ఐ లవ్ యూ అన్నానని.. అలా ఎందుకు అన్నానో త్వరలోనే తెలుస్తుందని మాధవీలత చెబుతోంది. త్వరలోనే ఇండస్ట్రీలోని నిప్పులాంటి నిజాలు బయటికి వస్తాయని మాధవీలత వెల్లడించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే శ్రీరెడ్డి పుణ్యమా అని ఇండస్ట్రీలోని చీకటి కోణాలు చాలా వెలుగు చూశాయి. ఇప్పుడు మాధవీలత ఇంకెన్ని సంచలనాలు వెల్లడిస్తుందో.

Image result for PAWAN+MADHAVILATHA

మరి ఆ నిప్పులాంటి నిజాలు మాధవీలత తాను వెల్లడిస్తుందా.. లేక ఇంకెవరైనా చెబుతారా అన్న దానిపై తన ఫేస్ బుక్ పోస్టులో క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా ఇంకా ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: