ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టి, జ‌నంలో స‌రికొత్త ఆశ‌లు రేపిన ప‌వ‌ర్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన పార్టీ జ‌న‌సేన ప‌య‌నం ఎటు?  ఏ దిశ‌గా అది న‌డుస్తోంది. ఎవ‌రు న‌డిపిస్తున్నారు?  అస‌లు ఈ పార్టీ వ్యూహ, ప్ర‌తివ్యూహాలు ఏమిటి? అనే చ‌ర్చ ఆస‌క్తిక‌రం గా సాగుతోంది. పార్టీ స్ఠాపించి నాలుగేళ్ల అవుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ స‌రైన వ్యూహం లేకుండానే పార్టీ న‌డుస్తోం ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రో ఏడాదిలోగా ఎన్నిక‌లు ఉన్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప‌వ‌న్ స‌న్నద్ధం కావాల్సిన అవ‌స‌రం ఉంది. అదే స‌మ‌యంలో పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, ప్ర‌స్తుతం త‌లెత్తిన తీవ్ర రాజ‌కీయ సంక్షోభాన్ని ఎదుర్కొని ముందుకు సాగితేనే త‌ప్ప ప‌వ‌న్ ఏంట‌నేది నిరూపించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. 


మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ ఏం చేస్తున్న‌ట్టు?  నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రంపై, రాష్ట్రం ప్ర‌భుత్వంపై విరుచు కుప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, 2014లో ప‌వ‌నే ఈ రెండు ప్ర‌భుత్వాల ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌దు. అయితే, ఇప్ప‌డు ఆయ‌న మ‌రో కోణంలో వెళ్తున్నారు. త‌న‌కు మ‌ర‌క‌లు అంట‌కుండా, ప్ర‌భుత్వాల త‌ప్పుల‌కు తాను బాధ్యుడు కాకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతా బాగానే ఉంది. పోనీ.. త‌నంత‌ట తానుగా పార్టీని బ‌లోపేతం చేస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్తున్నాడా? ప‌్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరుకు సిద్ధ‌మ‌వుతున్నాడా? అనేవి ప్ర‌ధాన ప్ర‌శ్న‌లుగా మిగిలాయి. నిజానికి ప‌వ‌న్ పార్టీ పెట్టిన‌నాటి నుంచి గందర గోళమే కనిపిస్తోంది. 

Image result for janasena pawan kalyan protest

ఒకవైపు తనకు ఏ కులం లేదని అంటూనే తన సామాజిక వ‌ర్గం కాపులు ఎక్కువ‌గా ఉండే, కాపు ఓటు బ్యాంకు భారీగా ఉండే నియోజ‌కవ‌ర్గాల‌ను ఏరికోరి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.  ఈ మధ్య కమ్యూనిస్టు పార్టీ నేతలు ప‌వ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఎవ‌రు కొత్త‌గా క‌నిపిస్తే వారితో క‌లిసి ప్ర‌యాణించే క‌మ్యూనిస్టుల‌కు ప‌వ‌న్ తురుపు ముక్క‌లా ప‌నిచేస్తాడ‌ని భావిస్తున్నారు. ఈ విష‌యంలో కామ్రేడ్లు చాలా స్పీడ్‌గానే ఉన్నారు. ప‌వ‌న్ త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని మ‌రీ మాట్లాడు తున్నారు. ఈ క్ర‌మంలోనే  ఈ నెల 15, 16 వ తేదీల్లో తమ పార్టీ అనంతపురంలో సభ నిర్వహిస్తుందని, ఆ సభకు పవన్ కల్యాణ్ వస్తాడని ప్రకటించారు. అయితే, అనంతలో పవన్ సభ గురించి క్లారిటీ లేదు. 

Image result for janasena pawan kalyan protest

ఈ సభ వాయిదా పడిందనో, మళ్లీ నిర్వహిస్తామనో.. ఒక ప్రకటన కూడా చేయలేదు. మొత్తంగా చూస్తే.. ప‌వ‌న్ వ్య‌వ‌హారం చాలా గోప్యంగా ఉందా?  లేదా గంద‌ర‌గోళ‌మా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక‌, తాను పార్టీ పెట్టింది అధికారంలోకి వ‌చ్చేందుకు కాద‌ని, త‌న‌కు ప‌ద‌వుల‌పై వ్యామోహం లేద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. అదేవిధంగా సీఎం ప‌ద‌వి అంటే అనుభ‌వంతో కూడుకున్న‌ద‌ని అంటాడు. ఇక‌, తాను 25 సంవ‌త్స‌రాల వ్యూహంతో పార్టీని స్థాపించిన‌ట్టు ప్ర‌క‌టించాడు. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఏంచేయాల‌ని అనుకుంటున్నాడో కూడా అంత అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా జ‌న‌సేన ఓ ద‌శ దిశ‌లేని పార్టీగా మారుతోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: