ప్రపంచంలో జరిగే కొన్ని వార్తలు..సంఘటనలు చూస్తుంటే..గుండెల్లో వణుకు పుడుతుంది. మనుషుల్లో నరరూప రాక్షసులు ఉంటారా..అది కూడా మనమద్యనే తిరుగుతున్నారా..అన్న విషయం తల్చుకుంటే..గుండె గుభేల్ అంటుంది. రీసెంట్ గా ఓ వ్యక్తిని చంపి అతని రక్తం, బూడిద తో పెయింటింగ్ వేసిన ఓ నరరూప రాక్షసుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ మద్య భార్య భర్తలు మనుషులను చంపి దాచుకొని మరీ తినేవారని అతగాడి సెల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు చూసి పోలీసులు ఖంగు తిన్నారు. తాజాగా మానవ గుండెలను కాల్చుకు తినే నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా‌ అరెస్టయ్యాడు.


మనుష్యులను దారుణంగా హత్యలు చేసి.. వారి గుండెలను పెకిలించి.. కాల్చుకుతినే జంగిల్ జబ్బా అలియాస్ మొహమ్మద్ జబ్బతెహ్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని హత్య చేసి అమెరికా పారిపోయిన జంగిల్ జబ్బా చిక్కాడు. 1990 దశకంలో అతని నేతృత్వంలోని సైన్యం వందలాది మందిని హత్య చేశారు. చిన్నారులను సైనికులుగా మార్చడమే కాకుండా, బహిరంగంగా ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు చేయించాడు. ఆపై 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయి, అక్కడే పెళ్లి చేసుకుని, ఫిలడెల్ఫియాలో బిజినెస్ మ్యాన్ గా స్థిరపడ్డాడు. 
Image result for jungle-jabbah arrest
ఫిలడెల్ఫియాలో బిజినెస్‌ మ్యాన్‌గా స్థిరపడ్డాడు. ఆపై 15 సంవత్సరాల తర్వాత యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో అతన్ని న్యాయస్థానం దోషిగా తేల్చింది. సాక్ష్యాధారాలు కూడా బలంగా వుండటంతో అతనికి కఠిన కారాగార శిక్ష ఖాయమని తెలుస్తోంది. గురువారం అతనికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో జబ్బతెహ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, జంగిల్ జబ్బా పై వ్యతిరేకంగా న్యాయస్థానం ముందు సాక్ష్యమిచ్చిన ఓ మహిళ, జబ్బతెహ్ అకృత్యాలను కళ్లకు కట్టినట్టు వివరించింది. తన సైన్యంతో కలసి ఊచకోత కోసిన వారి గుండెలను పెకలించారని, వాటిలో తన భర్త, మరిది గుండెలు కూడా వున్నాయని చెబుతూ, 1991లో తమ గ్రామంపై జరిగిన దాడిని గుర్తు చేసుకుంది. ఆ గుండెలను తినేందుకు వీలుగా వండి పెట్టాలని తనను ఆదేశించారని, వల్లకాదంటే, తననూ చంపేస్తానని బెదిరించారని పేర్కొంది. ఇంతటి కఠినాత్ముడు..మానవ మృగం..నరరూప రాక్షసుడికి చంపేయాలని..చాలా మంది కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: