జ‌మ్మూ కాశ్మీర్‌లోని క‌థువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా సామూహిక అత్యాచారానికి గురైన విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆమెను నిర్బంధించి, ఆహారం ఇవ్వ‌కుండా మ‌రీ.. అత్యాచారం చేశారు కొంద‌రు నీచులు. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చెల‌రేగుతున్నాయి. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి.దాదాపు అన్ని రాజ‌కీయ పార్టీలూ ఈ ఘ‌ట‌న‌పై స్పందించాయి. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలంటూ ప్ర‌తి ఒక్క‌రు గ‌ళ‌మెత్తుతున్నారు.సుప్రీంకోర్టులో దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంది.

భార‌తీయులంద‌రూ ఏక‌తాటిపై నిలిచి, ఆసిఫాకు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు.  17ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన భాజపా ఎమ్మెల్యేను ఏడురోజుల పాటు సీబీఐ కస్టడీకి తీసుకుంది. ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగర్‌కు ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో సీబీఐ శుక్రవారం అతడిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ మరువక ముందే..ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది.
Image result for ఉన్నావ్ కేసు
తల్లిదండ్రులతో పాటు వివాహ వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల  బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి పనుల్లో ఉన్న తల్లిదండ్రుల కళ్లుగప్పిన సోను(18) బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన ఈటా గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లిలో  ఎత్తున సౌండ్  పెట్టడంతో బాలిక కేకలు పెద్దలకు వినిపించలేదు.
Image result for rape case
బాలికను కిరాతకంగా చంపిన సోను కూడా మృతదేహం పక్కనే మద్యం సేవించి పడివుండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సోను అదుపులోకి తీసుకున్ని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని కథువా ఘటనలో మృగాళ్ల కవరానికి బలైన ఎనిమిదేళ్ల అసిఫాను చూసి అఖడం భారతం కళ్లు చెమర్చింది. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ముక్తకంఠంతో ఖండించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: