ఏపీ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపినట్టు తెలిసింది. ఇంత అకస్మాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత టీడీపీ-బీజేపీ మద్య తేడాలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి హరిబాబును తప్పిస్తారని ప్రచారం జరిగింది.  ఇప్పుడు హరిబాబు రాజీనామాతో ఆ ప్రచారానికి మరింత బలం వచ్చింది. 


తాజాగా ఈ విషయంపై స్పందించిన భాజాపా ఫ్లోర్‌లీడ‌ర్ విష్ణుకుమార్ రాజు  ఆయన పదవీ కాలం పూర్తి అయినందునే పార్టీ నియమాలకు కట్టుబడి రాజీనామా చేశారని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి రాజ‌కీయాలు లేవ‌న్నారు. ఆయన సమర్థవంతుడైన నాయకుడని, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని తాము కోరుతున్నామని తెలిపారు.  

Image result for bjp

హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ప్రస్తావించామని, ఆయన రాజీనామాతో విశాఖ రైల్వే జోన్ కు ఎటువంటి ఢోకా ఉండదని అన్నారు. కచ్చితంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని తెలిపారు.రాష్ట్ర ఇన్‌చార్జి బాధ్య‌లు రామ్‌మాధ‌వ్ తీసుకున్న త‌ర్వాత పార్టీలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనిలో భాగంగానే హ‌రిబాబును రాజీనామా చేయించింది అధిష్టానం.


మరింత సమాచారం తెలుసుకోండి: