సాధారణ ఎన్నికల అనంతరం అంధ్రప్రదేశ్లో  తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' జగన్ పార్టీకి తీరని అన్యాయం చేసిన విషయం తెలిసిందే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుండి టీడీపీ కి ఫిరాయించి జగన్ కు పెద్ద షాక్ ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అన్ని సభల్లోనూ వినతిని సమర్పించినా దాన్ని పట్టించుకొనే నాథుడే లేకపోయాడు.


అయితే 'ఆపరేషన్ ఆకర్ష్' కాస్తా 'ఆపరేషన్ వికర్ష్' గా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకుగల కారణాలూ లేకపోలేదు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో మంత్రి పదవులు ఆశించి ఫిరాయించిన వారు కొందరయితే, తామ మీద ఉన్న కేసులకు భయపడి పార్టీ మారిన వారు ఇంకొందరు. బాబు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వాములు అయేందుకు  తాము టీడీపీలోకి  మారుతున్నామని చెప్పినా ఇప్పుడు వారిలోని 10 మంది ఎమ్మెల్యేలు మళ్లీ సొంతగూటికి రావడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.


రాజకీయ అవసరాల కోసం నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి మిగిలిన మాకు అన్యాయం చేశారు అంటూ బాబుపై వారు ఒత్తిడి పెంచుతున్నారట. సొంతగూటికి రావడంపై ఆ పదిమంది జగన్ తో చర్చలకు దిగగా ఆయన నుండి ఎటువంటి స్పందన రాలేదని పలువురు మాట్లాడుకుంటున్నారు. అంతేగాక గతంలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఫిరాయింపు ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు సైతం వచ్చే ఎన్నికలలో తమకు టిక్కెట్ ఇస్తున్నారా?లేదా! అంటూ బాబుపై ఒత్తిడి పెంచుతున్నారట. మరి ఎవరు ఏ పార్టీలో ఉంటారు అని తెలుసుకోవాలంటే ఎన్నికలు వచ్చే వరకు వేచిచూడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: