టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దేనిని నిర్మూలించడానికైతే మహిళా నటీమణులు పోరాటం చేస్తున్నారో దాన్ని మరచి ఇతరులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.  హీరో రాజశేఖర్ కు ఆమె భార్య జీవిత నే అమ్మాయిలను సప్లై చేస్తుందని ఒక మహిళా నాయకురాలు ఒక ఛానెల్ వేదికగా చెప్పి బాంబు పేల్చింది. తాజాగా ఆమె అనిన  మాటలపైన, ఛానెల్ పైన జీవిత గారు ఒక ప్రెస్ నోట్ ను విడుదలచేశారు.


"ఈ నెల 14 తారీఖున టీఆర్పీ రేటింగ్స్ కోసం పరమావధిగా తమయెదుగుదల కోసం ఎవరిమీదైనా బురదజల్లడానికి వెనుకాడడానికి ఘనత వహించిన మహా న్యూస్ అనే దగా, న్యూస్ ఛానెల్ వారు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఒక మహిళా నాయకురాలు సాక్షాలు లేకుండా నామీద, నా కుటుంబం మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె మాట్లాడిన ప్రతీవిషయం నిజమే అనేంతగా యాంకర్ గా వ్యవహరించిన షో యాంకర్ కు ఇదే నా సమాదానం" అంటూ ఈ విధంగా తెలిపింది.


"ఛానెల్ చేతిలో ఉంది కదా అని ఏవి పడితే అవి టెలికాస్ట్ చేయద్దు. వీటిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నాను. కాస్టింగ్ కౌచ్ మీద ఏర్పాటు చేసే కమిటీలో సభ్యరాలుగా ఉండటంవల్ల వాళ్లకు అన్యాయం చేస్తారని వాళ్ళు పథకం ప్రకారం ఇలా ఆరోపణలు చేశారు. ప్రజలు వీటిని నమ్మకండి. సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా ఉన్న నేను ఇటువంటి c గ్రేడ్ ఛానెళ్ళకు, పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తులతో డైరెక్ట్ గా మాట్లాడలేక ఇలా బహిరంగ ప్రకటనను విడుదలచేస్తున్నాను" అని ప్రకటన విడుదలచేసి ఆ ఛానెల్కు చెంపదెబ్బల రుచి చూపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: