మోడీ ప్రధానమంత్రి పీఠం ఎక్కాక కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా హడలెత్తించింది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. అప్పట్లో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందు ప్రధాని మంత్రి మోడీని లక్ష్యం చేసుకుని కేజ్రీవాల్ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ దేశంలో చర్చనీయాంశ నాయకుడిగా అవతరించారు.

Related image

అయితే ఆ తర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీ లో బిజెపి కాంగ్రెస్ జాతీయ పార్టీలను వెనక్కి తన్ని కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఢిల్లీలో ఉన్న రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నెలకొంటుంది. అయితే ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆప్ సర్కార్ కు మరో షాక్ ఇచ్చింది.

Related image

ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన తొమ్మిది మంది సలహాదారులను కేంద్ర హోంశాఖ తొలగించింది. వీరిలో సీనియర్ అతిశీ మర్లేనా సైతం ఉన్నారు. ఆర్థికశాఖ అనుమతి తెలపనందునే వీరిని తొలగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సస్పెండైన వారిలో ముఖ్య నాయకుడైన రాఘవ్ చందా స్పందిస్తూ...కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వారి తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యుడు తేగా నష్టపోతున్నాడు అన్ని అన్నారు.

Image result for modi and kejriwal

దేశంలో ప్రస్తుతం నగదు కొరత అలాగే అత్యాచారాల ఘటన బిజెపికి తలనొప్పిగా మారాయి..ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న ప్రజల దృష్టిని మలచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై గురి పెట్టింది అని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: